Site icon NTV Telugu

Gudivada Amarnath: హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ

Amernath

Amernath

Gudivada Amarnath: ఎన్నికల ముందు హలో ఏపీ.. బైబై వైసీపీ అని విస్తృత ప్రచారం చేసిన కూటమి పార్టీలు వంచన చూసిన తర్వాత హలో ఏపీ.. కూటమి పెట్టింది టోపీ అని ప్రజలు మాట్లాడుకునే పరిస్థితి ఏర్పడిందని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. అధికారంలోకి వచ్చేందుకు చేసిన అసాధ్యమైన వాగ్దానాలు మోసపూరితమైనవని బడ్జెట్ కేటాయింపులతో తెలిపోయిందని పేర్కొన్నారు. ఏపీ మ్యాప్ లో అమరావతి తప్ప వెనుకబడ్డ రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలు లేవు అనే విధానంలో కేటాయింపులు చేయడం అభ్యంతరకరమని వైసీపీ నేత అమర్నాథ్ అన్నారు.

Read Also: Hit and Run Case: నార్సింగి పీఎస్ పరిధిలో హిట్ అండ్ రన్ కేసు..

ఇక, ఉచిత బస్సు సంక్రాంతికి వస్తుందని చెబితే ఆ పేరు మీద సినిమా వచ్చిందే తప్ప బస్సు మాత్రం రోడ్డెక్క లేదని గుడివాడ అమర్నాథ్ ఆక్షేపించారు. ప్రజలకు జీవిత కాలం గుర్తుండిపోయే విధంగా చంద్రబాబు వాత పెట్టారని ఎద్దేవా చేశారు. గ్రామాల్లోకి వెళితే మహిళలు తిరగబడేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. కేసులకు భయపడి ఇంట్లో కూర్చునే పరిస్థితి వైసీపీ నాయకత్వానికి లేదన్నారు అమర్నాథ్.

Exit mobile version