Site icon NTV Telugu

Visakha Mayor: గ్రేటర్ విశాఖ మేయర్పై అవిశ్వాసం కోసం కౌంట్డౌన్..

Vizag

Vizag

Visakha Mayor: గ్రేటర్ విశాఖపట్నం మేయర్ పై అవిశ్వాసం కోసం కౌంట్ డౌన్ ప్రారంభమైంది. ఏప్రిల్ 19వ తేదీన కౌన్సిల్ ప్రత్యేక సమావేశం కానుంది. అవిశ్వాస తీర్మానంపై ఇప్పటికే కార్పొరేటర్లకు కలెక్టర్ ఆఫీస్ సమాచారం వెళ్లింది. అవిశ్వాసం ఎదుర్కొంటున్న తొలి మేయర్ గా హరివేంకట కుమారి నిలవనున్నారు. ఇక, బల పరీక్షలో టీడీపీ నెగ్గాలంటే 75 మంది బలం అవసరం ఉంది. మెజారిటీకి నలుగురు సభ్యుల దూరంలో కూటమి ఉంది.

Read Also: Sanoj Mishra : మోనాలిసా డైరెక్టర్ సనోజ్ మిశ్రా కేసులో భారీ ట్విస్ట్..

ఇక, 34 మంది కార్పోరేటర్లను వైసీపీ బెంగుళూరుకు తరలించింది. ప్రస్తుతం భీమిలి తర్వాత మలేషియాలో
కూటమి నేతలు శిబిరం ఏర్పాటు చేశారు. టీడీపీ క్యాంప్ రాజకీయాలకు దూరంగా జనసేన పార్టీ ఉంది. శిబిరాల సంస్కృతి లేదని, అధినేత ఆదేశాలు ఫైనల్ అని హైకమాండ్ క్లారిటీ ఇచ్చింది. మొత్తం కార్పొరేటర్లు 98 మంది ఉండగా.. ఒక స్థానం ఖాళీగా ఉంది. కార్పొరేటర్లు 97 + ఎక్స్ ఆఫీషియో 14 ఉన్నాయి. టోటల్ ఓట్లు 111 కాగా, 2/3 మెజారిటీ ఉంటేనే అవిశ్వాసం నెగ్గడం కూటమికి సాధ్యం అవుతుంది.

Exit mobile version