CM Chandrababu: నేడు విశాఖకు సీఎం చంద్రబాబు.. ఆ రూట్లలో ట్రాఫిక్ ఆంక్షలు!
- నేడు విశాఖకు సీఎం చంద్రబాబు..
- బీచ్ రోడ్డులోని ఏయూ కన్వెన్షన్ సెంటర్లో స్వస్థ్ నారీ- సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం..
- మహిళల కోసం ప్రత్యేక వైద్య శిబిరాలను ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
CM Chandrababu: విశాఖపట్నంలో ముఖ్యమంత్రి చంద్రబాబు పర్యటించనున్నారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఈరోజు ఉదయం 10 గంటలకు తాడేపల్లి నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో బయలుదేరి 11: 15 నిమిషాలకు బీచ్ రోడ్డులోని కోస్టల్ బ్యాటరీ హెలిపాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి ఆర్కే బీచ్ రోడ్డులో ఏయూ కన్వెన్షన్ సెంటర్‌కి చేరుకోనున్నారు. కన్వెన్షన్ సెంటర్లో జరిగే ఉమన్ అండ్ చైల్డ్ హెల్త్ స్క్రీనింగ్ క్యాంప్ కార్యక్రమంలో ముఖ్యమంత్రి పాల్గొననున్నారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటల నుంచి ఏయూ కన్వెన్షన్ సెంటర్ లో ప్రధాన మంత్రి మోడీ వర్చువల్ గా ప్రారంభించే స్వస్త్ నారీ సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొంటారు.
Read Also: Fraud: చిట్టీలు వేస్తున్నారా? జాగ్రత్త.. చిట్టీల పేరుతో ఘరానా మోసం.. రూ. 5 కోట్లతో పరార్..
Also Read
- Godavari Floods: గోదావరి వరదలపై ప్రభుత్వం అలర్ట్.. ప్రభావిత జిల్లాలకు హోంమంత్రి కీలక ఆదేశాలు
- Botsa Satyanarayana: జగన్ పర్యటనను విజయవంతం చేశాం.. కూటమి ప్రభుత్వంపై బొత్స తీవ్ర ఆరోపణలు
- Rajnath Singh: భారత నౌకాదళం ఆర్థిక ప్రయోజనాలకు రక్షకుడు
- Governor Abdul Nazeer: డిగ్రీలతోనే ఆగిపోవద్దు.. నైపుణ్యాలు, ఆవిష్కరణలపై దృష్టి పెట్టాలి..
అలాగే, మధ్యాహ్నం 3 గంటలకు హోటల్ రాడిసన్ బ్లూలో జరిగే గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ బిజినెస్ సమ్మిట్ లోనూ ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొనే అవకాశం ఉంది. అనంతరం సాయంత్రం 5 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 5: 20 గంటలకు కోస్టల్ బ్యాటరీ హెలిపాడ్ కు చేరుకుని తిరిగి తాడేపల్లి బయలుదేరి వస్తాడు. ఇక, ఇవాళ విశాఖలో సీఎం పర్యటనతో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. బందోబస్తు, ఇతర ఏర్పాట్లపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ప్రధానంగా దృష్టి పెట్టారు. ముఖ్యమంత్రి పర్యటన సమయంలో కొంతవరకు ట్రాఫిక్ ఇబ్బందులు వచ్చే ఛాన్స్ ఉండటంతో ప్రత్యామ్నాయ మార్గాల వైపు ప్రజలు వెళ్లాలని సూచనలు చేశారు. సీఎం చంద్రబాబు వచ్చే సమయంలో ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తామని పోలీసులు వెల్లడించారు.
తాజావార్తలు
-
Accident : స్కూల్ ఆటోను ఢీకొట్టిన లారీ, 10 మంది విద్యార్థులకు గాయాలు
-
Rainy Season Tips : వర్షాల్లో ఉప్పు, పంచదార గట్టిపడుతున్నాయా? ఈ కిచెన్ ట్రిక్స్‌తో ఈజీ సొల్యూషన్!
-
Bankipur Results: 30 ఏళ్ల బీజేపీ కంచుకోట బద్దలు.. బంకీపూర్‌లో ప్రశాంత్ కిషోర్ సంచలన విజయం
-
AP Weather Alert: రానున్న 3 గంటలు జాగ్రత్త.. పిడుగులతో వర్షాలపై APSDMA హెచ్చరిక.. ఈ జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్..
-
Allu Arjun: బన్నీ ఫోకస్ మారిందా! పొరుగు హీరోలు తిరస్కరించిన కథలకే అల్లు అర్జున్ ఓకే చెబుతున్నాడా?
ట్రెండింగ్
-
Asha Chocolate : 90స్ కిడ్స్ ఫేవరెట్ ‘ఆశ చాక్లెట్’ మాయమైందెందుకు? అసలు కారణం ఇదే.!
-
Kitchen Hacks : ఈ సింపుల్ చిట్కాతో.. కరివేపాకు పాడవకుండా నెలరోజులు ఫ్రెష్‌గా ఉంటుంది..!
-
Rainy Season Tips : వర్షాకాలంలో వానపాముల బెడదా..? ఈ సింపుల్ చిట్కాలతో సులభంగా చెక్ పెట్టండి.!
-
7050mAh భారీ బ్యాటరీ, 6.83 అంగుళాల కర్వ్డ్ OLED డిస్ప్లే, 50MP Sony కెమెరాతో రానున్న vivo S2.!
-
Mushroom Onion Pakoda: ఈజీ స్నాక్ రెసిపీ..10 నిమిషాల్లో కరకరలాడే ‘మష్రూమ్ ఆనియన్ పకోడీ’.! చేసేయండి ఇలా..