MLA Vishnukumar Raju: తిరుమల శ్రీ వేంకటేశ్వర స్వామి లడ్డూ ప్రసాదంపై వివాదం కొనసాగుతోంది.. లడ్డూల్లో జంతువుల కొవ్వు కలిపారంటూ సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు సంచలనంగా మారాయి.. ఇక, టీటీడీ ఈవో స్టేట్‌మెంట్.. ల్యాబ్స్ రిపోర్టులు బయటకు రావడం కలకలం సృష్టించింది.. ఇక, ఈ వ్యవహారంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని కూడా జగన్ మోసం చేశాడని ఫైర్ అయ్యారు.. తిరుపతి లడ్డూ తయారీలో అవినీతికి పాల్పడ్డారని ఆరోపించారు.. దేవుడితో పెట్టుకున్న వైఎస్ జగన్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మూత పడిపోవడం ఖాయం అని వ్యాఖ్యానించారు.. ఇక, వైసీపీ పాతాళంలోకి వెళ్లిపోవడం ఖాయం అన్నారు.. రాష్ట్రాన్ని నాశనం చేసిన జగన్ పార్టీలో ఉన్నవారు ఒకసారి ఆలోచించండి అని హితవుపలికారు.. దేవుడిని కూడా వదలని జగన్ పార్టీని వదిలి మీకు ఇష్టం వచ్చిన పార్టీలో చేరండి అంటూ పిలుపునిచ్చారు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు..
Read Also: VETTAIYAN : రజనీకాంత్ ‘వెట్టయాన్’ ప్రివ్యూ టీజర్ రిలీజ్..
వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాపనార్థాలు పెట్టారు విష్ణుకుమార్ రాజు… కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి, ఆయన పార్టీ పాతాళానికి జారిపోవడం ఖాయమన్న ఆయన.. దేవుడిని మోసం చేసిన పార్టీలో ఉండాలో వద్దో అక్కడ వున్న నాయకత్వం ఆలోచించుకోవాలని సూచించారు. వైసీపీని వీడి తమకు అనుకూలంగా ఉన్న పార్టీలో చేరాలని నేతలకు సూచించారు విష్ణుకుమార్ రాజు. ఇక, విశాఖలోని రీజనల్ ఐ హాస్పిటల్ దగ్గర కూటమి పార్టీ నాయకులతో కలిసి అన్న క్యాంటీన్ ను ప్రారంభించిన బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు.. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ హాట్ కామెంట్లు చేశారు..