Vizag: విశాఖపట్నంలో ఎన్నారై మహిళ మృతి కేసులో బిగ్ ట్విస్ట్ నెలకొంది. ఎన్టీవీ వరుస కథనాలపై పోలీస్ యంత్రాంగం కదిలింది. ఇప్పటి వరకు కేసును నీరుగార్చే ప్రయత్నంలో ఉండగా.. ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి వరుసగా కథనాలు ప్రసారం అయ్యేసరికి పోలీస్ యంత్రాంగం ఒత్తిడిలోకి పోయింది. మొదట FIR కాపీలో నిందితుడు, అనుమానితుడు ఎవరు లేరని పేర్కొన్నారు.. పోలీసుల తీరుపై అనుమానాలు ఎక్కువ అవుతుండడంతో.. ఎట్టకేలకు ఎన్ఆర్ఐ మహిళా ఆత్మహత్య చేసుకునేలా డాక్టర్ పిల్లా శ్రీధర్ ప్రేరేపించాడని పోలీసులు అరెస్ట్.
Read Also: Vallabhaneni Vamsi: వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసిన కోర్టు..
ఇక, డాక్టర్ పిల్లా శ్రీధర్ పై BNS 108 ప్రకారం కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా అతడ్ని రిమాండ్ కు తరలించారు. ఎన్నారై మహిళ మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఆత్మహత్య చేసుకునేలా చేశాడా? హత్య చేశాడా అనేది విచారణలో తెలియాల్సి ఉంది.. అనుమానితుడు డాక్టర్ పిల్లా శ్రీధర్ ను పోలీసులు కస్టడీలోకీ తీసుకుంటారా లేదా అనే దానిపై ఇప్పటి వరకు క్లారిటీ రాలేదు.