MInister Satyakumar Yadav: ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ మరింత విస్తృతం చేస్తున్నాం.. అనారోగ్య ఆంధ్రప్రదేశ్‌ను ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ దిశగా తీసుకెళ్తున్నాం అన్నారు ఏపీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్.. విశాఖ కేజీహెచ్‌లోని csr బ్లాక్ లో ఏర్పాటు చేసిన కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ను ప్రారంభించారు మంత్రి సత్యకుమర్.. 40 కోట్ల రూపాయల విలువైన అత్యాధునిక రేడియేషన్ ఆంకాలజీ పరికరాలతోపాటు.. సూపర్ స్పెషాలిటీ బ్లాక్ లో ఎండో క్రైనాలజీ విభాగంలో DEXA మెషిన్‌ను ప్రారంభించారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు విష్ణు కుమార్ రాజు, వంశీకృష్ణ శ్రీనివాస్, కూటమి నాయకులు, వైద్య ఆరోగ్య శాఖ అధికారులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా మంత్రి సత్య కుమార్ యాదవ్ మాట్లాడుతూ.. అనారోగ్య ప్రదేశ్ ను ఆరోగ్య ఆంధ్ర ప్రదేశ్ దిశగా తీసుకు వెళ్తున్నాం అన్నారు.. ఎన్టీఆర్ ఆరోగ్యశ్రీ ని మరింత విస్తృతం చేస్తున్నాం అన్నారు..
Read Also: NehaShetty : ఆహా.. నేహా.. ఆ అందాలు చూస్తే అదరహో అనాల్సిందే
క్యాన్సర్ మహమ్మారిగా తయారైంది.. ఐసీఎంఆర్ లెక్కలు ప్రకారం దేశంలో 8.74 లక్షలు మంది, మన రాష్ట్రంలో 42 వేల మంది క్యాన్సర్ తో ప్రాణాలు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు సత్యకుమార్.. క్యాన్సర్ మహమ్మారి తీవ్రతను గుర్తించి రాష్ట్రంలో నాలుగు చోట్ల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ ఏర్పాటు చేశాం. 2031 కి ప్రతి 50 కిలో మీటర్ల పరిధిలో ఒక క్యాన్సర్ సెంటర్ ఏర్పాటు చేస్తాం అన్నారు.. కేన్సర్ రహిత సమాజం దిశగా అడుగులు వేస్తున్నాం. కేజీహెచ్ ఆసుపత్రిలో సుమారు 45 కోట్లు తో అంకాలజీ పరికరాలు అందుబాటులోకి తీసుకువచ్చాం.. ఈ పరికరాలు ద్వారా నాణ్యమైన క్యాన్సర్ చికిత్సను అందించవచ్చు అని వెల్లడించారు ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్..
