NTV Telugu Site icon

Chandrababu: మోడీ అంటే నమ్మకం, విశ్వాసం

Chandrababu

Chandrababu

ఏపీలో ఎక్కడా లేని ఉత్సాహం విశాఖలో కనిపిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. విశాఖ ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో చంద్రబాబు మాట్లాడారు. విశాఖలో మోడీ రోడ్ షో అదిరిందన్నారు. ఎక్కడికి పోయినా.. మోడీపై విశ్వాసం, నమ్మకం ప్రజలకు కలుగుతోందని తెలిపారు. రూ.2లక్షల కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం కావడం తన జీవితంలో ఎప్పుడూ చూడలేదన్నారు. విశాఖ ప్రజల చిరకాల వాంఛ అయిన రైల్వేజోన్ కల నెలవేరిందన్నారు. ఇకపై విజయాలే తప్ప.. అపజయాలు ఉండవన్నారు. గత ఐదేళ్లు ఏపీ వెంటిలేటర్‌పై ఉందని పేర్కొన్నారు. కష్టాలు ఉన్నాయని.. వాటిన్నంటినీ అధిగమిస్తామని.. అరకు కాఫీని మోడీనే ప్రమోట్ చేశారన్నారు. త్వరలో అమరావతికి మోడీ రావాలని కోరారు.

ఇది కూడా చదవండి: Racharikam: భయపెడుతున్న అప్సరా రాణి

ఏపీలో ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించిందన్నారు. భవిష్యత్తులోనూ ఈ కాంబినేషన్‌ కొనసాగుతుందని పేర్కొన్నారు. ఢిల్లీ ఎన్నికల్లోనూ ఎన్డీఏ గెలుస్తుందని.. రాసి పెట్టుకోవాలన్నారు. పేదల జీవితాల్లో వెలుగులు నింపేందుకు మోడీ కృషి చేస్తున్నారన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సంస్కరణలు, సుపరిపాలన.. మోడీ నినాదాలు అని తెలిపారు. దేశాన్ని బలమైన ఆర్థిక శక్తిగా మార్చేందుకు మేకిన్‌ ఇండియా తెచ్చారన్నారు. స్టార్టప్‌ ఇండియా, స్కిల్‌ ఇండియా, గతిశక్తి తెచ్చారన్నారు. దేశానికి ఆర్థిక రాజధానిగా ముంబై ఎలా ఉందో.. ఏపీకి విశాఖ అలాంటి ఆర్థిక నగరంగా ఉందని చంద్రబాబు వివరించారు. గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌, డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌, మంత్రులు లోకేశ్‌, అనిత, టీజీ భరత్‌, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు కార్యక్రమంలో పాల్గొన్నారు.