CM Chandrababu: విశాఖపట్నంలో జరగుతోన్న డీప్ టెక్ సమ్మిట్ 2024లో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. ఆ వేదికగా కొత్త నినాదం అందుకున్నారు.. ఏఐ, ఎంఐ, క్వాంటం కంప్యూటింగ్‌తో ఆర్థిక, విద్య, వైద్య రంగాల్లో మార్పులపై ఏర్పాటు చేసిన ఎగ్జిబిషన్‌ను పరిశీలించారు.. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు డోలా బాల వీరాంజనేయులు, కొల్లు రవీంద్ర, వంగలపూడి అనిత, కొండపల్లి శ్రీనివాస్ తదితరలు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ.. టెక్నాలజీ మన జీవితంలో భాగమైపోయిందన్నారు.. టెక్నాలజీ వల్ల పారదర్శకత, జవాబుదారీతనం పెరుగుతోందన్న ఆయన.. సాంకేతికతతో అనేక మార్పులు వస్తున్నాయన్నారు.. ఏపీని నాలెడ్జ్ హబ్‌గా మార్చాలని అనుకుంటున్నాం అన్నారు.. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణగా అభిర్ణించారు.. ఇక, ఒక కుటుంబం నుంచి ఒక పారిశ్రామిక వేత్త, ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలనే నినాదం తీసుకున్నామని వెల్లడించారు ఏపీ సీఎం..
Read Also: Komatireddy Venkat Reddy: నాకు పేరు వస్తుందనే కేసీఆర్ నిధులు విడుదల చేయలేదు..
పరిపాలనలో టెక్నాలజీని భాగస్వామ్యం చేయటమే కొత్త టార్గెట్ అన్నారు సీఎం చంద్రబాబు.. ఐటీ గురుంచి ఎవరు మాట్లాడినా హై టెక్ సిటీని ప్రస్తావించకుండా ఉండలేరని పేర్కొన్నారు.. ఐటీ గురుంచి అప్పుడప్పుడే మాట్లాడుతున్న సమయంలోనే ఆ అవకాశాలను అంది పుచ్చుకోగలిగాం.. ఇప్పుడు డీప్ టెక్నాలజీ సరికొత్త ఆవిష్కరణ. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, మెషీన్ లెర్నింగ్, క్వాంటం కంప్యూటింగ్ లాంటి అధునాతన అన్వేషణలను పరిపాలనలో భాగస్వామ్యం చేసి మెరుగైన సేవలు అందించడమే కొత్త టార్గెట్‌గా పెట్టుకున్నాం అన్నారు.. డ్రోన్ లు కీలక భూమిక పోషిస్తున్నాయని.. టెక్నాలజీ వృద్ధి తర్వాత వైద్య ఖర్చులపై అయ్యే వ్యయం బాగా తగ్గుతుందన్నారు.. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047లో 15 శాతం వృద్ధి రేటును లక్ష్యంగా పెట్టుకున్నాం.. జనాభా ఇప్పుడు ఆస్తిగా పరిగణించే పరిస్థితులు ఏర్పడ్డాయన్నారు.. పాపులేషన్ మేనేజ్మెంట్ అనేది ఇప్పుడు చాలా కీలకంగా మారిందని సూచించారు.. పాపులేషన్, టెక్నాలజీ ఆధారంగా గ్లోబల్ హబ్ గా ఇండియా మారుతుందనే నిమ్మకాన్ని వ్యక్తం చేశారు..
Read Also: Eatala Rajendar: రేపు రాష్ట్రానికి జేపీ నడ్డా.. సభా ప్రాంగణం పర్యవేక్షించిన ఎంపీ ఈటెల..
4P ఫార్ములాను తీసుకున్నాం… విశాఖపట్టణం నాలెడ్జ్ ఎకానమీ హబ్‌గా మారుతుందని పేర్కొన్నారు సీఎం చంద్రబాబు.. వ్యవసాయ రంగంలో ఏపీ ముందుంది.. జీరో బడ్జెట్ నేచురల్ ఫార్మింగ్ కు టెక్నాలజీని అనుసంధానం చేసి మంచి ఫలితాలు సాధిస్తాం.. సముద్ర ఉత్పత్తులు, ఎగుమతులపై దృష్టిసారించాం అన్నారు.. విద్యుత్ సంస్కరణలు విజయవంతంగా అమలు చేయగలిగాను అదే సమయంలో నా పవర్ పోయిందని గుర్తుచేసుకున్న ఆయన.. ఒక కుటుంబం నుంచీ ఒక పారిశ్రామిక వేత్త, ఒక ఐటీ ప్రొఫెషనల్ ఉండాలనే నినాదం తీసుకున్నాం… డీప్ టెక్నాలజీ మీద ప్రతీ మూడు నెలలకు ఒకసారి ఎగ్జిబిషన్ జరగాలి… డీప్ టెక్నాలజీ మీద నిపుణులు ఇచ్చే సూచనలు వినడానికి ఒక విద్యార్థిగా రోజంతా కేటాయిస్తాను అన్నారు.. డీప్ టెక్ ద్వారా రాష్ట్ర అభివృద్ధికి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు అనేది తెలుసుకోవడానికి పూర్తి సమయం కేటాయిస్తానన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు..