NTV Telugu Site icon

Vizag: విశాఖ వాసులకు గుడ్‌న్యూస్‌.. కానీ, జాగ్రత్త సుమీ..!

Vizag

Vizag

Vizag: ఆంధ్రప్రదేశ్‌లో అతిపెద్ద నగరం విశాఖపట్నం… పరిశ్రమలు, వ్యాపార, వాణిజ్యాలకు కేరాఫ్ అడ్రస్. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న స్టీల్ సిటీలో జటిలమైన సమస్యల్లో ఒకటి ట్రాఫిక్. ఇక్కడ చిక్కుకుంటే ఎదురయ్యే కష్టాలు అనుభవించిన వాళ్ళకే అర్థం అవుతాయి. ప్రజా రవాణా వ్యవస్థ పూర్తిస్థాయిలో లేకపోవడం, భౌగోళిక పరిస్థితులు కారణంగా ప్రైవేటు వాహనాల సంఖ్య ఏటికి ఏడాది పెరుగుతోంది. ఒక అంచనా ప్రకారం ప్రతీ ఏటా పదివేల కొత్త వాహనాలు విశాఖ రోడ్లపైకి వస్తున్నాయి.

Read Also: Big Scam: దెయ్యాలకు లోన్లు రెన్యువల్, రుణమాఫీ..

అనకాపల్లి నుంచి అనందపురం వరకు ఆర్టిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత సేవలను ప్రయోగత్మకంగా ప్రారంభించేందుకు పోలీస్‌ యంత్రాంగం సన్నాహాలు పూర్తి చేసింది. ఇందులో భాగంగా ఆటో నంబరు ప్లేట్‌ రికగ్నిషన్‌ టెక్నాలజీ కలిగిన కెమెరాలను సిగ్నలింగ్ పాయింట్ దగ్గర ఏర్పాటు చేస్తారు. AI ఆధారంగా జంక్షన్‌లో ఎటు వైపు నుంచి ఎక్కువ వాహనాలు వస్తున్నాయో, వాటి సంఖ్య ఎంత ఉందో అంచనా వేస్తాయి. ఏ వైపునకు ఎక్కువ వాహనాలు వెళుతున్నాయో టెక్నాలజీ ద్వారా కాలిక్యులేట్‌ చేసుకొని సిగ్నలింగ్‌ సమయాన్ని ఆటోమేటిక్‌గా మార్చుకుంటాయి.

Read Also: 2492 Carat Diamond : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వజ్రం.. ఎన్ని క్యారెట్లో తెలుసా ?

అయితే, సిటీలో ఒక ఎండ్ నుంచి మరో ఎండ్‌కు చేరాలంటే పీక్ టైంలో మూడు గంటలకు పైగా సమయం పడుతుంది. అదే AI ఆధారిత ట్రాఫిక్ రెగ్యులేటరీ సిస్టం ద్వారా.. వాహనాల సంఖ్య ఆధారంగా సిగ్నల్స్ ఆపరేట్ అవుతాయి. దీని కారణంగా ఎక్కువ సమయం రోడ్లపై వెయిట్ చేసే సమయం తగ్గనుంది. ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే విజువల్ పోలీసింగ్ కోసం వినియోగించే సిబ్బంది సంఖ్య తగ్గే అవకాశం ఉంది. AI ఆధారిత సేవలు విశాఖపట్నం వాసులకు ట్రాఫిక్ కష్టాల నుంచి ఖచ్చితమైన ఊరట ఇస్తాయని పోలీస్ కమిషనర్ చెప్తున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత సౌకర్యంతమైన ప్రయాణాన్ని అందిస్తుందో తేడా వస్తే అదే స్థాయిలో షాక్ ల మీద షాక్ లు తప్పవని సీనియర్ అధికారులు భావిస్తున్నారు. ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు, అడ్డగోలు డ్రైవింగ్ చేసే వాహనదారులకు ఇప్పటివరకు పోలీసులు, నిఘా కెమెరాలు గుర్తిస్తేనే ఫైన్ లు పడేవి. ఒక్కసారి AI ఎంట్రీ ఇస్తే ఎక్కడ ఎప్పుడు తప్పు జరిగినా ఆటోమేటిక్‌ చలానాలు నజనరేట్ అయిపోతాయి. ఇకపై విశాఖ రోడ్లపై ఉల్లంఘనలకు పాల్పడితే ఫైన్లు, కేసుల మోత తప్పదని హెచ్చరిస్తున్నారు.