2492 Carat Diamond : ప్రపంచంలోనే రెండో అతి పెద్ద వజ్రం.. ఎన్ని క్యారెట్లో తెలుసా ?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
2492 Carat Diamond : కెనడియన్ మైనింగ్ కంపెనీ ఆఫ్రికన్ దేశం బోట్స్వానాలో గొప్ప విజయాన్ని సాధించింది. అది ప్రపంచంలో రెండవ అతిపెద్ద వజ్రాన్ని కనుగొంది. ఈ వజ్రం 2492 క్యారెట్‌లని చెబుతున్నారు. ఈ ఆవిష్కరణ తర్వాత కంపెనీ అధికారులు చాలా సంతోషంగా ఉన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం 119 సంవత్సరాల క్రితం కనుగొనబడింది. ఇది 3041 క్యారెట్లు. శతాబ్దానికి పైగా తర్వాత ఈ విజయం సాధించింది. లుకారా డైమండ్ కార్ప్ బోట్స్వానా గనులలో 2,492 క్యారెట్ల వజ్రాన్ని కనుగొంది. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రం అని చెబుతున్నారు. మైనింగ్ కంపెనీ స్వయంగా ఈ విషయాన్ని వెల్లడించింది. ఈశాన్య బోట్స్‌వానాలోని కరోవే డైమండ్ మైన్‌లో ఎక్స్‌రే టెక్నాలజీని ఉపయోగించి ఈ వజ్రాన్ని కనుగొన్నట్లు లుకారా డైమండ్ కార్ప్ గురువారం ఒక ప్రకటనలో తెలిపింది.
Read Also:Money On Roads: ఇదేమి పోయేకాలం.. ట్రాఫిక్‌లో డబ్బులు విసురుతూ రీల్స్.. (వీడియో)
Also Read
- LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
- CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
- Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
- Trump-Jinping: 24న వైట్‌హౌస్‌లో జిన్‌పింగ్‌కు విందు.. మస్క్, సుందర్ పిచాయ్, టిమ్ కుక్కు ఆహ్వానం
డైమండ్ ధర ఎంత?
లూకారా ఈ ఆవిష్కరణ తర్వాత వజ్రం ధరను ఇంకా వెల్లడించలేదు లేదా వజ్రం నాణ్యత గురించి ఎలాంటి సమాచారాన్ని వెల్లడించలేదు. ప్రపంచంలోనే అతిపెద్ద వజ్రం 3016 క్యారెట్ కల్లినన్ వజ్రం 1905లో దక్షిణాఫ్రికాలో కనుగొనబడింది. ఈ అసాధారణమైన 2,492 క్యారెట్ల వజ్రం రికవరీ చేయడం పట్ల మేము చాలా సంతోషిస్తున్నాము అని లుకారా ఛైర్మన్ విలియం లాంబ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ వజ్రం అరచేతిలో పట్టేంత పెద్దదిగా ఉందని కంపెనీ విడుదల చేసిన ఫోటోలు తెలియజేస్తున్నాయి.
Read Also:Supreme Court : సుప్రీంకోర్టు ఆవరణలో లాయర్ తొడ కొరికేసిన కోతి
మరోవైపు, ఈ భారీ వజ్రాన్ని గురువారం బోట్స్వానా అధ్యక్షుడు మోక్‌వీట్సీ మసిసికి చూపించారు. ఇది ప్రపంచంలోనే రెండో అతిపెద్ద వజ్రమని ఆయన ప్రభుత్వం పేర్కొంది. తమ దేశంలోనే ఈ ఆవిష్కరణ జరగడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోని అతిపెద్ద వజ్రాల ఉత్పత్తిదారుల్లో బోట్స్వానా ఒకటని.. ఈ దేశానికి ఇది ప్రధాన ఆదాయ వనరు. ప్రపంచంలో ఉత్పత్తి అయ్యే వజ్రాలలో 23 శాతం బోట్స్వానా నుండి వచ్చాయి. దాని జీడీపీలో 30 శాతం, ఎగుమతుల్లో 80 శాతం ఈ వజ్రాల నుంచే ఆదాయం సమకూరుతుంది. బోట్స్‌వానా రాజధాని గాబోరోన్‌కు దాదాపు 500 కిలోమీటర్ల దూరంలో ఉన్న కైరో గని నుంచి ఈ వజ్రం వెలికితీయబడింది.
తాజావార్తలు
-
America: హౌతీలతో లోపయకారి ఒప్పందం.. సౌదీని రోడ్డున పడేసిన అగ్రరాజ్యం!
-
LPG UPI Payments: కొత్త యూపీఐ నిబంధన.. ఎల్పీజీ సిలిండర్లపై తీవ్ర ప్రభావం..?
-
CM Chandrababu: రాజముద్ర వేసి ఇళ్ల పట్టాలు ఇస్తున్నాం.. మిగిలిన వారికి కూడా ఇస్తాం..
-
Greenland Deal: ట్రంప్ ఆశ నెరవేరింది.. గ్రీన్‌ల్యాండ్‌పై డెన్మార్క్‌తో డీల్..
-
Ajit Doval: సినిమాను మించిన థ్రిల్లర్! అజిత్ డోవల్ పంచుకున్న అత్యంత ప్రమాదకరమైన సీక్రెట్ మిషన్..
ట్రెండింగ్
-
Pat Cummins: కోహ్లీ, రోహిత్ కాదు.. అతడే వెరీ టఫ్.. వికెట్ ఇవ్వకుండా విసిగించేవాడు!
-
Gautam Gambhir: నా కోచింగ్ కెరీర్లోనే అదే కఠిన నిర్ణయం.. అతడు చాలా ఏడ్చాడు.. గంభీర్ షాకింగ్ కామెంట్స్!
-
iPhone 18 India Sales: ఐఫోన్ 18 కోసం 12 గంటల పాటు స్టోర్ల వద్ద క్యూ.. తొలి రోజే రికార్డ్ స్థాయి అమ్మకాలు..!
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్‌తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!