NTV Telugu Site icon

Vizag Kidney Racket Case: కిడ్నీ రాకెట్ కేసులో మరో ట్విస్ట్..!

Vizag

Vizag

Vizag Kidney Racket Case: విశాఖపట్నం కిడ్నీ రాకెట్‌ కేసు కలకలం రేపుతోంది.. ఈ కేసులో దర్యాప్తును ముమ్మరం చేశారు విశాఖ పోలీసులు.. అయితే, కిడ్నీ కేసులో మరో ట్విస్ట్ వచ్చి చేరింది.. తమ దగ్గర ఎటు వంటి చట్ట విరుద్ధ మైన ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు జరగవని ప్రకటించింది NRI హాస్పిటల్… కో-ఆర్డినేటర్ అనిల్ ను ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించామని వెల్లడించారు. నెఫ్రాలజిస్ట్ ప్రస్తావన లేకుండా జాగ్రత్త పడింది NRI హాస్పిటల్… FIR లో కో ఆర్డినేటర్ అనిల్ తో పాటు డాక్టర్ పేరు ఉండగా.. బాధితుల నుంచి వ్యక్తిగత అకౌంట్ కు 10 లక్షల రూపాయలు డిపాజిట్ చేయించారు అనిల్.. ఇక, కిడ్నీ రాకెట్ లో అనిల్ దళారీగా మారినట్టు ఆధారాలు చూపుతున్నారు పోలీసులు.. గతంలో అనిల్ పనిచేసిన హాస్పిటళ్లలో జరిగిన కిడ్నీ ఆపరేషన్లపై కూడా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. ఈ కేఉసులో వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తోంది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్…

Read Also: GHMC Council Meeting: మేయర్ పోడియంను చుట్టుముట్టిన బీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు..

అయితే, కిడ్నీ రాకెట్ కేసులో క్వీన్స్ ఎన్ఆర్ఐ హాస్పిటల్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది.. ఘటనపై ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తున్న నేఫథ్యంలో ఆసుపత్రి వర్గాల్లో గుబులు రేగుతోంది.. తెలివిగా కిడ్నీ రాకెట్ కేసులో తప్పించుకునేందుకు హాస్పిటల్ యాజమాన్యం ప్రయత్నం చేస్తోంది.. తమ దగ్గర ఎటువంటి చట్ట విరుద్ధమైన ట్రాన్స్ ప్లాంటేషన్ సర్జరీలు జరగవని ప్రకటించారు.. కో ఆర్డినేటర్ అనిల్ ను ఉద్యోగం నుంచి తొలగించి పోలీసులకు అప్పగించామని వెల్లడించారు.. కో-ఆర్డినేటర్ అనిల్ పై పూర్తి తప్పును తోసేసింది హాస్పిటల్‌ యాజమాన్యం… హాస్పిటల్ యాజమాన్యానికి తెలియకుండానే డబ్బులు వసూలు చేశాడా అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.. కిడ్నీ రాకెట్ లో అనిల్ దళారీగా మారినట్టు ఆధారాలు చూపుతున్నారు. మొత్తంగా ఈ వ్యవహారం ఇప్పుడు కలకలం రేపుతోంది.