NTV Telugu Site icon

Cruise Terminal Project: విశాఖకే తలమానికం క్రూజ్ టెర్మినల్ ప్రాజెక్ట్

Gvl 3 Capital

Gvl 3 Capital

విశాఖపట్నం.. సాగరతీరం మరింతగా అభివృద్ధి చెందడానికి మార్గం సుగమం అవుతోంది. పరిపాలన రాజధానిగా త్వరలో రూపాంతరం చెందనున్న విశాఖపట్నంలో మరిన్ని ప్రాజెక్టులు రానున్నాయి. విశాఖకు తలమానికంగా భావిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక క్రూజ్ టెర్మినల్ ప్రోజెక్టు 2023 కల్లా విశాఖపట్నంలో ప్రారంభం కానుందపి బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలిపారు.

దాదాపు 2000 చదరపు మీటర్ల వైశాల్యంతో 96 కోట్ల రూపాయల అంచనాతో సుమారు 50 వేల నుండి లక్ష వరకు సామర్థ్యం కలిగిన గ్రాస్ రిజిస్టర్ టన్నేజి కంటైనర్ల సామర్థ్యంతో విశాఖలో క్రూజ్ టెర్మినల్ ను అతి త్వరలో ప్రారంభించనున్నట్లు ఎంపీ తెలిపారు. మంగళవారం పార్లమెంటులో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర పోర్టులు షిప్పింగ్ మరియు జల రవాణా శాఖ మంత్రి సమాధానమిచ్చారు.

Naga Chaitanya: శోభితాతో రిలేషన్.. ఎట్టకేలకు నోరు విప్పిన చైతన్య

ఈ సందర్భంగా జీవీఎల్ మాట్లాడుతూ ఇప్పటికే టూరిజంలో ప్రపంచంలోనే తొలి పది పర్యాటక ప్రదేశాలలో స్థానం సంపాదించవలసిన విశాఖపట్నం గత, ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల ఎంతో వెనుకబడిందన్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో త్వరలో ప్రారంభించబోతున్న క్రూజ్ టెర్మినల్ ఆ ఘనతను సాధించే అవకాశం ఉందన్నారు. విశాఖను అతి త్వరలో ప్రపంచ పర్యాటక ప్రదేశాల్లో మొదటి వరుసలో నిలుపగలదని ధీమా వ్యక్తం చేశారు. ఈ విషయంపై తాను మరింత చొరవ తీసుకొని వీలైనంత తొందరగా క్రూజ్‌ టెర్మినల్ ఏర్పాటుకు ప్రయత్నం చేస్తానని ఎంపీ జీవీఎల్ నరసింహారావు తెలియజేశారు.