YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ జగన్ మాజీ సీపీఆర్వో శ్రీహరి అరెస్ట్..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
YS Jagan Former CPRO Srihari Arrested: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాజీ సీపీఆర్వో శ్రీహరిని పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుపై అనుచిత పోస్టులు పెట్టినట్లు వచ్చిన ఫిర్యాదుల మేరకు చిత్తూరు పోలీసులు ఈ చర్యలు తీసుకున్నారు. ‘రక్త చరిత్ర’ పేరుతో సీఎం చంద్రబాబు నాయుడు చేతుల్లో కత్తులు ఉన్నట్లుగా ఫొటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేసినట్లు శ్రీహరిపై ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంపై చిత్తూరు పోలీస్ స్టేషన్లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. సాంకేతిక ఆధారాల సాయంతో శ్రీహరిని గుర్తించిన పోలీసులు, ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీడియా కార్యదర్శిగా ఉన్న శ్రీహరి.. వైఎస్ జగన్మోహన్ రెడ్డి.. ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో.. ఆయనకు సీపీఆర్వోగా వ్యవహరించారు.. ప్రస్తుతం విజయవాడ లో శ్రీహరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు చిత్తూరుకు తరలిస్తున్నారు…
Also Read
- Vangaveeti Radha : నగర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. మేయర్‌గా బాధ్యత మరింత పెరిగింది
- AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి హవా..
- 53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
- Vangaveeti Radha: ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన వంగవీటి రాధా.. లైట్ తీసుకుంటా..!
తాజావార్తలు
-
Off The Record: మంత్రి పుట్టలో వేలు పెట్టారా? ఢిల్లీలో దామోదర వర్సెస్ ఎమ్మెల్యే!
-
Off The Record: మంత్రి వర్సెస్ ఎంపీ.. పెద్దపల్లి కాంగ్రెస్‌లో ఓపెన్ లెటర్ల వార్
-
Rakesh Varre : ‘బ్లడ్ బాత్’ సినిమాలకు చెక్.. మ్యూజికల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మాయలేడి’తో వస్తున్నాం!
-
Off The Record: ఆవేదనా? ఆక్రోశమా? రాజగోపాల్ రెడ్డి వ్యాఖ్యల వెనుక అసలు కథ!
-
Nithiin Narne: షూటింగ్ స్పాట్లో తీవ్ర గాయం.. యంగ్ హీరో నితిన్ నార్నేకు సర్జరీ
ట్రెండింగ్
-
ICC ర్యాంకింగ్స్‌లో భారీ మార్పులు.. టాప్ ప్లేస్‌కు మిచెల్ స్టార్క్.. ఏడో స్థానానికి శ్రేయస్ అయ్యర్..!
-
Sanna Karam Pusa Recipe: ఆయిల్ పీల్చకుండా కరకరలాడే ‘సన్న కారపూస’.. పక్కా కొలతలతో ఈజీగా చేసేయండి ఇలా..!
-
Motichoor Laddu Recipe: దీపావళి స్పెషల్.. నోట్లో వేస్తే కరిగిపోయే ‘మోతిచూర్ లడ్డు’.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా..!
-
IND vs NZ: ఆక్లాండ్‌లో ‘కింగ్’ షో.. తొలి వన్డేలో భారత్ విజయం..!
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 188 కి.మీ ప్రయాణం.. స్పోర్టీ లుక్‌తో కొత్త ఎలక్ట్రిక్ బైక్ Hero VIDA VXZ..