Teppotsavam: విజయవాడలోని కృష్ణానదిలో రేపు నిర్వహించే దుర్గమ్మ తెప్పోత్సవానికి బ్రేక్? పడింది. ప్రకాశం బ్యారేజీ దగ్గర వరద ఉధృతి నేపథ్యంలో తెప్పోత్సవ నిర్వహణకు బ్రేక్ పడే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. దసరా శరన్నవరాత్రి ఉత్సవాల ఆఖరి రోజున శ్రీ గంగా, పార్వతి సమేత మల్లేశ్వర స్వామి ఉత్సవమూర్తులకు కృష్ణానదిలో నదీ విహారం నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్న ఆచారం. గత రెండేళ్లుగా కృష్ణానదిలో హంస వాహనంపై నదీ విహారానికి బ్రేక్ పడుతుంది.
Read Also: Cyclone Alert: బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం.. ఏపీలోని ఈ జిల్లాలకు భారీ వర్ష సూచన..
ఇక, ఈ ఏడాదైన దుర్గమ్మ నదీ విహారం చూద్దామని భక్తులు ఆశ పడ్డారు. కానీ, కృష్ణానదిలో వరద ఉధృతి ఎక్కువగా ఉండటంతో తెప్పోత్సవానికి బ్రేక్ పడింది. ఇప్పటికే దుర్గమ్మ గుడి అధికారులకు నదిలో తెప్పోత్సవం నిర్వహించడం అసాధ్యమంటూ ఇరిగేషన్ అధికారులు లేఖ అందజేశారు. తాజాగా, ఉత్సవ మూర్తులను దుర్గా ఘాట్ దగ్గర ఉంచి పూజలు నిర్వహించాలా లేదా ప్రత్యామ్నాయ ఏర్పాట్లపై వైదిక కమిటీలతో అధికారులు చర్చిస్తున్నారు. రెండవ ప్రమాద హెచ్చరిక కొనసాగుతుండటంతో నదిలో హంస వాహనం పెట్టి పూజలు నిర్వహించినా ఫ్లోటింగ్ ఎక్కువుగా ఉంటుంది కాబట్టి కష్టం అవుతుందని ఇరిగేషన్ అధికారులు వెల్లడిస్తున్నారు. దీంతో దుర్గా గుడి అధికారులు, అర్చకులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు అనే దానిపై ఉత్కంఠ కొనసాగుతుంది.
