NTV Telugu Site icon

Eat Right Station certification: ఈ రైల్వే స్టేషన్లకు ‘ఈట్ రైట్ స్టేషన్’గా 5స్టార్ రేటింగ్..

Vijayawada Railway Station

Vijayawada Railway Station

Eat Right Station certification: విజయవాడ రైల్వే స్టేషన్ FSSAI నుండి ‘5 స్టార్ ఈట్ రైట్ స్టేషన్’ సర్టిఫికేట్ పొందింది.. విజయవాడ రైల్వే స్టేషన్ అత్యుత్తమ పరిశుభ్రత మరియు సురక్షితమైన ఆహార పద్ధతులను అమలు చేసినందుకు భారత ఆహార భద్రత మరియు ప్రమాణాల అథారిటీ (FSSAI) నుండి ప్రతిష్టాత్మకమైన ‘ఈట్ రైట్ స్టేషన్’ ధృవీకరణను పొందింది. పూర్తి పరిశుభ్రత, క్వాలిటీ, వాడే ప్రతీ ఆహార పదార్దంలోనూ ఎలాంటి లోపాలు లేకుండా చూసుకోవడం, స్టాండర్డ్ ప్రకారం ఉండాల్సిన అన్ని ప్రమాణాలను అనుసరించడం ప్రధానంగా ఇక్కడ గుర్తించాలి.. దాదాపు ఆరు నెలలపాటు జరిగిన పలు ఆడిట్‌ల అనంతరం, పూర్తిస్ధాయి శిక్షణ తరువాత FSSAI అధికారులు ఈట్ రైట్ స్టేషన్‌గా 5 స్టార్ రేటింగ్ ను ఇచ్చారు.. ఇప్పటి వరకూ రెండు తెలుగు రాష్ట్రాలలో విజయవాడ, అన్నవరం, గుంటూరు, నాంపల్లి, నడికుడి రైల్వెస్టేషన లకు సౌత్ సెంట్రల్ రైల్వే పరిధిలో ఈట్ రైట్ స్టేషన్లుగా 5 స్టార్ సర్టిఫికేట్ వచ్చింది…

Read Also: KTR: మళ్ళీ కేసీఆర్ను సీఎంను చేసుకునే దాకా విశ్రమించకుండా పోరాడుదాం..

ప్రధానంగా రైలులో ప్రయాణించే ప్రతీ ప్రయాణికుడూ రైల్వే స్టేషన్‌లో వెయిటింగ్ లో ఉంటారు..‌ అలాంటిది విజయవాడ ద్వారా దాదాపు రోజుకు 4 లక్షలకు పైగా ప్రయాణికులు ప్రయాణిస్తుంటారు.. అలాంటి చోట కచ్చితంగా వెయిటింగ్ లో ఉండే ప్రయాణికులు లక్షల్లోనే ఉంటారు.. పూర్తిస్ధాయిలో అన్నీ పరిశీలించిన తరువాత ప్రతీ ఒక్కరిని పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి, స్టాండర్డ్ లను పూర్తిగా పాటించేలా చేసి, ఈట్ రైట్ సర్టిఫికేట్ కోసం దరఖాస్తు చేశారు విజయవాడ రైల్వేస్టేషన్ అధికారులు.. పలు విధాలుగా ఆడిట్ నిర్వహించిన FSSAI అధికారులు విజయవాడ రైల్వేస్టేషన్ కు 5 స్టార్ రేటింగ్ ఇస్తూ ఈట్ రైట్ స్టేషన్ గా సర్టిఫికేట్ ఇచ్చారు.. ఈ సర్టిఫికేట్ రెండు సంవత్సరాల పాటు అర్హత ఇస్తుంది.. ఆ తరువాత మరోసారి FSSAI ఆడిట్ నిర్వహించి, మరోసారి కూడా అర్హత వస్తే ఈట్ రైట్ సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుందని అధికారులు తెలిపారు. మొత్తంగా అన్నవరం, గుంటూరు, నడికుడి, నాంపల్లి రైల్వే స్టేషన్‌లు దక్షిణ మధ్య రైల్వే (ఎస్‌సీఆర్‌) జోన్‌లో ‘ఈట్‌ రైట్‌ స్టేషన్‌’ సర్టిఫికేషన్‌ పొందాయని అధికారులు వెల్లడించారు..