Fire Services Week: అగ్నిమాపక శాఖ వారోత్సవాలకు శ్రీకారం.. నిబంధనలు కఠినంగా అమలు చేయాల్సిందే..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Fire Services Week: ఆంధ్రప్రదేశ్‌లో రాష్ట్ర అగ్నిమాపక శాఖ వారోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. విజయవాడ గవర్నర్‌పేటలోని Andhra Pradesh Fire Services Headquarters లో జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఫైర్ డీజీ వెంకటరమణతో పాటు ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. కార్యక్రమం ప్రారంభంలో విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన అగ్నిమాపక అమరవీరుల స్మృతికి ఘన నివాళులు అర్పించారు. అనంతరం డీజీపీ జెండా ఆవిష్కరించి, అగ్నిమాపక శాఖ ఆధునిక పరికరాలతో ఏర్పాటు చేసిన ప్రత్యేక ప్రదర్శనను తిలకించారు.
Read Also: Modi-Kharge: మోడీ-ఖర్గే మధ్య సరదా సంభాషణ.. మనసారా నవ్వుకున్న నేతలు
Also Read
- Vijayawada: పేదలకు సీఎం చంద్రబాబు గుడ్‌న్యూస్.. 24 వేలకుపైగా కుటుంబాలకు ఇళ్ల పట్టాలు
- Local Body Elections: అభివృద్ధి, సంక్షేమమే ఎజెండా.. స్థానిక ఎన్నికలపై కూటమి వ్యూహం.. మంత్రి పార్థసారధి కీలక వ్యాఖ్యలు
- CPM Local Poll Strategy: స్థానిక ఎన్నికల్లో వారితో కలిసి పోటీ..! సీపీఎం కీలక ప్రకటన
- Vijayawada: విజయవాడలో పేలుడు పదార్థాల కలకలం.. రంగంలోకి పోలీసులు
ఈ సందర్భంగా డీజీపీ హరీష్ కుమార్ గుప్తా మాట్లాడుతూ.. ఇది కేవలం స్మరణ దినం మాత్రమే కాదని, దేశానికి అగ్నిమాపక శాఖ అందిస్తున్న సేవలను గుర్తు చేసుకునే రోజు అని అన్నారు. విధి నిర్వహణలో ప్రాణత్యాగం చేసిన ధైర్యవంతులైన అగ్నిమాపక సిబ్బందికి ఘన నివాళి అర్పిస్తున్నామని తెలిపారు. 1944లో జరిగిన Bombay Dock Explosion తర్వాత అగ్నిమాపక దినోత్సవాల ప్రాముఖ్యత మరింత స్పష్టమైందన్నారు. వారి త్యాగం కేవలం చరిత్రలో నిలిచిపోయిన ఘటన మాత్రమే కాదని, నేటి అగ్నిమాపక సేవలకు అది బలమైన పునాది అని పేర్కొన్నారు. ప్రమాదం సంభవించినప్పుడు సాధారణంగా ప్రజలు బయటకు పరుగులు తీస్తారని, కానీ అగ్నిమాపక సిబ్బంది మాత్రం లోపలికి వెళ్లి ప్రాణాలను కాపాడేందుకు ముందుంటారని అన్నారు. ఇది క్రమశిక్షణతో కూడిన ధైర్యం, నిరంతర శిక్షణ, ప్రజాసేవ పట్ల నిబద్ధతకు నిదర్శనమని చెప్పారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా అగ్నిమాపక శాఖ సేవలు కూడా విస్తరించాయని డీజీపీ తెలిపారు. పట్టణీకరణ, పారిశ్రామిక విస్తరణ, మౌలిక సదుపాయాల పెరుగుదలతో ప్రమాదాల తీవ్రత పెరిగిందన్నారు. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ అగ్నిమాపక శాఖ కేవలం ప్రమాదం జరిగిన తర్వాత స్పందించే స్థాయి నుంచి, డేటా మరియు సాంకేతికత ఆధారంగా ముందస్తు అప్రమత్తత దిశగా అడుగులు వేస్తోందని వెల్లడించారు. బాణసంచా పరిశ్రమలు, రసాయన విపత్తులు, పారిశ్రామిక ప్రమాదాలు వంటి సవాళ్లు పెరుగుతున్న నేపథ్యంలో భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందన్నారు. వ్యాపార సంస్థలు, ప్రైవేటు కార్యాలయాల నిర్వాహకులు బాధ్యతగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. అందరూ కలిసి భద్రతా పరికరాలు ఏర్పాటు చేసుకుని నిబంధనలను పాటించాలని పిలుపునిచ్చారు. ప్రజల్లో అవగాహన కల్పించడమే ఈ వారోత్సవాల ప్రధాన ఉద్దేశమని తెలిపారు. చాలా కాలం తర్వాత కొత్త పరికరాలను సమకూర్చుకోవడం ద్వారా అగ్నిమాపక శాఖ తన సామర్థ్యాన్ని మరింత పెంచుకుందని చెప్పారు.
విపత్తు నిర్వహణలో అగ్నిమాపక శాఖ పాత్ర అత్యంత కీలకమని డీజీపీ అన్నారు. తుఫానులు, వరదలు, భవనాలు కూలిపోవడం, పారిశ్రామిక ప్రమాదాలు వంటి ఏ విపత్తు వచ్చినా రెస్క్యూ ఆపరేషన్లలో ముందుగా స్పందించేది అగ్నిమాపక సిబ్బందేనని గుర్తుచేశారు. అగ్ని ప్రమాదాలను నివారించడం మనందరి ఉమ్మడి బాధ్యత అని పేర్కొన్న ఆయన.. అగ్నిమాపక, పోలీస్, విపత్తు నిర్వహణ, ఆరోగ్య శాఖలు కలిసి ఒకే వ్యవస్థగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. భవిష్యత్తులో అగ్నిమాపక భద్రతలో సాంకేతికత కీలక పాత్ర పోషించనుందని తెలిపారు.
తాజావార్తలు
-
OTR: పశ్చిమ గోదావరిలో వైసీపీకి ఏం జరుగుతోంది?
-
Gyanesh Kumar: ‘‘నాకు బీజేపీ టికెట్ ఆఫర్ చేశారు’’.. జ్ఞానేష్ కుమార్‌పై మాజీ కేరళ సీఎస్ సంచలన ఆరోపణలు
-
AP I&PR Wins SKOCH Awards: జాతీయ స్థాయిలో ఏపీ ఐ & పీఆర్‌కు అరుదైన గౌరవం.. స్కోచ్ అవార్డులు
-
IND Vs WI: యశస్వి జైస్వాల్‌కు బ్యాడ్ న్యూస్.. రేపే వెస్టిండీస్‌తో మ్యాచ్.. జట్టులోని ఆటగాళ్లు వీరే..
-
Off The Record: రిజర్వేషన్ తేలకముందే జెడ్పీ రేస్!
ట్రెండింగ్
-
Xiaomi Pocket Guitar: చేతిలో ఫోన్.. వెనుక గిటార్..! Xiaomi సరికొత్త యాక్సెసరీ మాములుగా లేదుగా.!
-
Hardik Pandya: రీఎంట్రీకి మరో బ్రేక్.. స్కాన్‌లో బయటపడ్డ కొత్త గాయం.!
-
Saturday Horoscope: ఆ రాశి వారికి నేడు పట్టిందల్లా బంగారమే.. నేటి రాశిఫలాలు ఇలా.!
-
Nuclear Weapons: 12 వేలకుపైగా అణ్వాయుధాలు.. ప్రపంచానికి పొంచి ఉన్న ముప్పేంటి.?
-
iPhone 18 Pro Max Review: ఐఫోన్ 18 ప్రో మ్యాక్స్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? రూ.1.79 లక్షలు పెట్టి కొనాలా? వద్దా?