Vallabhaneni Vamshi: రెండో రోజు ముగిసిన వంశీ విచారణ.. 3 గంటలకు పైగా ప్రశ్నలు
- రెండో రోజు ముగిసిన వల్లభనేని వంశీ విచారణ
- వైద్య పరీక్షలు నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు
- మూడు గంటలు పైగా సాగిన విచారణ
- నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాధానం చెప్పని వంశీ.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. ఈరోజు కూడా వంశీని 20 ప్రశ్నలు పైగా సంధించారు పోలీసులు. నిన్నటి లాగే పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు నాకు తెలియదు, సంబంధం లేదు అంటూ వంశీ సమాధానం చెప్పారు. గన్నవరం నియోజకవర్గంలో మైనింగ్ అక్రమా తవ్వకాలు జరిపారా అని వంశీని పోలీసులు ప్రశ్నించినట్టు సమాచారం. మైనింగ్కి తనకు ఎలాంటి సంబంధం లేదని.. కావాలనే తనపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని సమాధానం ఇచ్చినట్టు సమాచారం. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో.. ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్సులు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు అధికారులు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు వెనుక ఎవరెవరూ ఉన్నారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నాస్తాలు సంధించారు. సత్యవర్ధన్‌ను హైదరాబాద్ నుంచి విశాఖకు తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారని పోలీసులు ప్రశ్నించారు. అనంతరం.. వైద్య పరీక్షలు నిమిత్తం కృష్ణలంక పోలీసు స్టేషన్ నుంచి జీజీహెచ్‌కు తరలించారు పోలీసులు.. వైద్య పరీక్షల అనంతరం మళ్ళీ తిరిగి జైలుకు తరలించనున్నారు.
Read Also: Ramprasad Reddy: మార్చి 1, 2 తేదీలలో ఘనంగా గంగమ్మ జాతర నిర్వహిస్తాం..
Also Read
- TDP Office Attack Case: టీడీపీ ఆఫీసు దాడి కేసు.. రౌడీ షీట్ల వ్యవహారంలో కీలక మలుపు
- AP Drought: ఏపీలో 544 మండలాలను కరువు ప్రాంతాలుగా గుర్తించాలి.. జాతీయ విపత్తుగా ప్రకటించాలి..
- Nara Lokesh: ఏపీలో 50 శాతం మంది ఎమ్మెల్యేలు యువత.. పరిశ్రమలకు కొత్త అర్థం చెప్పడమే మా లక్ష్యం..
- Vijayawada Crime: విజయవాడలో కలకలం.. పెళ్లికి ఒప్పుకోలేదని ప్రియురాలిపై దాడి.. ప్రియుడు మృతి
వల్లభనేని వంశీని కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే.. కాగా, వల్లభనేని వంశీ రిమాండ్‌ను మార్చి 11వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.. వంశీ సహా నిందితుల రిమాండ్ పొడిగించారు. ఈ క్రమంలో.. వంశీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిన్న కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడున్నర గంటలపాటు వంశీని విచారించారు. అనంతరం.. ఈరోజు కూడా మూడు గంటలకు పైగా వంశీని పోలీసులు విచారించారు.
Read Also: Amit Shah: తమిళనాడు ఒక్క పార్లమెంట్ సీటు కూడా కోల్పోదు.. స్టాలిన్‌కి అమిత్ షా కౌంటర్..
తాజావార్తలు
-
Pakistan Cricket: గోల్డ్ మెడల్ వదిలేసి.. ఆ సిక్సరే హైలైట్ అంటున్న పాక్ క్రికెట్!
-
Vivek Bhagat: ‘‘నా ప్రమోషన్ ఆపండి’’.. ఢిల్లీ పోలీస్ అధికారి వివేక్ భగత్
-
AP Govt: దేశంలో తొలిసారిగా 3డీ టెక్నాలజీతో ఇళ్ల నిర్మాణాలు.. ఏక కాలంలో 3 లక్షల ఇళ్లు..
-
Advertising Rules: తెలంగాణలో ప్రకటనలపై(యాడ్స్) సర్కార్ కొత్త రూల్స్.. ఉత్తర్వులు జారీ..
-
Usha Vance: శిశువుతో హెలికాప్టర్ దిగుతుండగా కింద పడబోయిన ఉషా వాన్స్.. పట్టించుకోని సిబ్బంది
ట్రెండింగ్
-
Hong Kong Sixes 2026: మరోసారి భారత్-పాకిస్థాన్ మ్యాచ్.. కెప్టెన్‌గా భువీ..!
-
Smriti Mandhana: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత మహిళల కొత్త కెప్టెన్‌గా స్మృతి మంధాన..!?
-
Captain Changes: ఆసియా గేమ్స్‌లో ఓటమి.. పాకిస్థాన్ కెప్టెన్ పై వేటు..! కొత్త కెప్టెన్ ఎవరంటే.?
-
WCL 2026 నుంచి పాకిస్థాన్ ఛాంపియన్స్ ఔట్.. NOC ఇవ్వని PCB.!
-
Kakarakaya Vepudu: అన్నంలోకి ‘కాకరకాయ వేపుడు’.. ఇలా చేస్తే ప్లేట్ ఖాళీ అవ్వాల్సిందే.!