మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ రెండో రోజు విచారణ ముగిసింది. అనంతరం.. వైద్య పరీక్షలు నిమిత్తం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళారు పోలీసులు. వంశీని మూడు గంటలకు పైగా విచారించారు. నిన్న పోలీసులు అడిగిన ప్రశ్నలకు వంశీ సరైన సమాధానం చెప్పలేదు. దీంతో.. ఈ రోజు టెక్నికల్ ఎవిడెన్సులు చూపించి ప్రశ్నలు అడిగి సమాధానం రాబట్టే ప్రయత్నం చేశారు అధికారులు. సత్యవర్ధన్ కిడ్నాప్, బెదిరింపులు వెనుక ఎవరెవరూ ఉన్నారు అనే కోణంలో పోలీసులు ప్రశ్నాస్తాలు సంధించారు. సత్యవర్ధన్‌ను హైదరాబాద్ నుంచి విశాఖకు తీసుకుని వెళ్ళినప్పుడు ఎవరెవరు ఉన్నారని పోలీసులు ప్రశ్నించారు.
Read Also: Ramprasad Reddy: మార్చి 1, 2 తేదీలలో ఘనంగా గంగమ్మ జాతర నిర్వహిస్తాం..
వల్లభనేని వంశీని కిడ్నాప్, బెదిరింపుల కేసులో అరెస్ట్ చేసిన విషయం విదితమే.. కాగా, వల్లభనేని వంశీ రిమాండ్‌ను మార్చి 11వ తేదీ వరకు పొడిగించింది కోర్టు.. వంశీ సహా నిందితుల రిమాండ్ పొడిగించారు. ఈ క్రమంలో.. వంశీతో పాటు మరో ఇద్దరిని పోలీసులు మూడు రోజులు కస్టడీలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో నిన్న కస్టడీలోకి తీసుకున్న పోలీసులు.. మూడున్నర గంటలపాటు వంశీని విచారించారు. అనంతరం.. ఈరోజు కూడా మూడు గంటలకు పైగా వంశీని పోలీసులు విచారించారు. రేపటితో వల్లభనేని వంశీ కస్టడీ ముగియనుంది.
Read Also: Amit Shah: తమిళనాడు ఒక్క పార్లమెంట్ సీటు కూడా కోల్పోదు.. స్టాలిన్‌కి అమిత్ షా కౌంటర్..