Site icon NTV Telugu

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ రెండో రోజుల కస్టడీ పూర్తి.. మరోసారి అస్వస్థత..

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi

Vallabhaneni Vamsi Case: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్‌ రెండు రోజుల కస్టడీ పూర్తి అయ్యింది.. రెండు రోజుల పాటు నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వంశీని ప్రశ్నించారు కంకిపాడు పోలీసులు.. నకిలీ పట్టాల వ్యవహారంపై వంశీ నుంచి వివరాలు సేకరించారు.. అయితే, రాత్రి కంకిపాడు పోలీస్‌ స్టేషన్‌లోనే ఉన్న వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడం.. ఆస్పత్రికి తరలించడం.. ఆ తర్వాత మళ్లీ పీఎస్‌కు తీసుకొచ్చి ప్రశ్నించడం జరగగా.. మరోసారి అస్వస్థతకు గురయ్యారు వల్లభనేని వంశీ.. ఇక, రెండు రోజుల కస్టడీ కూడా పూర్తి కావడంతో.. కంకిపాడు పోలీస్ స్టేషన్‌ నుంచి వంశీని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు కంకిపాడు పోలీసులు.. వల్లభనేని వంశీకి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత తిరిగి విజయవాడ సబ్ జైలుకు తరలించనున్నారు పోలీసులు..

Read Also: Oka Brundavanam Review: ఒక బృందావనం రివ్యూ

కాగా, రాత్రి కంకిపాడు పీఎస్‌లో వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న వంశీ సతీమణి పంకజశ్రీ కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో వంశీకి చికిత్స అందించారు.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కంకిపాడు పోలీస్ కస్టడీ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వంశీ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. మెరుగైన వైద్యం కోసం వంశీని ఎయిమ్స్ కి తరలించాలని పేర్ని నాని ఆసహనం వ్యక్తం చేశారు. కాగా, కంకిపాడు ఆస్పత్రి నుంచి పీఎస్‌కు తరలించి.. ఇక, రెండు రోజుల కస్టడీ ముగియడంతో.. విజయవాడ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

Exit mobile version