Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీ రెండో రోజుల కస్టడీ పూర్తి.. మరోసారి అస్వస్థత..
- వల్లభనేని వంశీ మోహన్ రెండు రోజుల పోలీసు కస్టడీ పూర్తి..
- నకిలీ ఇళ్ల పట్టాల పంపిణీ వ్యవహారంలో వంశీని ప్రశ్నించిన పోలీసులు..
- వల్లభనేని వంశీకి మరోసారి అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vallabhaneni Vamsi Case: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ మోహన్ రెండు రోజుల కస్టడీ పూర్తి అయ్యింది.. రెండు రోజుల పాటు నకిలీ పట్టాల పంపిణీ వ్యవహారంలో వంశీని ప్రశ్నించారు కంకిపాడు పోలీసులు.. నకిలీ పట్టాల వ్యవహారంపై వంశీ నుంచి వివరాలు సేకరించారు.. అయితే, రాత్రి కంకిపాడు పోలీస్ స్టేషన్‌లోనే ఉన్న వల్లభనేని వంశీ అస్వస్థతకు గురికావడం.. ఆస్పత్రికి తరలించడం.. ఆ తర్వాత మళ్లీ పీఎస్‌కు తీసుకొచ్చి ప్రశ్నించడం జరగగా.. మరోసారి అస్వస్థతకు గురయ్యారు వల్లభనేని వంశీ.. ఇక, రెండు రోజుల కస్టడీ కూడా పూర్తి కావడంతో.. కంకిపాడు పోలీస్ స్టేషన్ నుంచి వంశీని విజయవాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు కంకిపాడు పోలీసులు.. వల్లభనేని వంశీకి విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షలు ముగిసిన తర్వాత తిరిగి విజయవాడ సబ్ జైలుకు తరలించనున్నారు పోలీసులు..
Read Also: Oka Brundavanam Review: ఒక బృందావనం రివ్యూ
Also Read
- AP Liquor Case: లిక్కర్ స్కాం కేసులో కీలక పరిణామం.. సిట్ విచారణకు మాజీ ఐఏఎస్
- Vijayawada Utsav 2026: విజయవాడ ఉత్సవ్ సీజన్-2కు సర్వం సిద్ధం.. ఉత్సవ్, సరస్ మేళాకు భారీ ఏర్పాట్లు
- PVN Madhav: సీఎం చంద్రబాబుకు బీజేపీ ఏపీ అధ్యక్షుడి లేఖ.. 22-A భూములపై కీలక సూచనలు
- Vijayawada CI Ali Death Case: సీఐ అలీ మృతి కేసులో కీలక పరిణామం.. కానిస్టేబుల్ ఫిర్యాదుతో..!
కాగా, రాత్రి కంకిపాడు పీఎస్‌లో వల్లభనేని వంశీ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు కంకిపాడు ప్రభుత్వ హాస్పిటల్ కి తరలించారు. విషయం తెలుసుకున్న వంశీ సతీమణి పంకజశ్రీ కంకిపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకున్నారు. కృష్ణా జిల్లా వైసీపీ అధ్యక్షుడు మాజీ మంత్రి పేర్ని నాని సైతం ఆసుపత్రికి వచ్చారు. ఆసుపత్రిలో వంశీకి చికిత్స అందించారు.. నకిలీ ఇళ్ల పట్టాల కేసులో కంకిపాడు పోలీస్ కస్టడీ లో ఉన్న గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ శ్వాసకోశ సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. వంశీ ఆరోగ్యంపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.. మెరుగైన వైద్యం కోసం వంశీని ఎయిమ్స్ కి తరలించాలని పేర్ని నాని ఆసహనం వ్యక్తం చేశారు. కాగా, కంకిపాడు ఆస్పత్రి నుంచి పీఎస్‌కు తరలించి.. ఇక, రెండు రోజుల కస్టడీ ముగియడంతో.. విజయవాడ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.
తాజావార్తలు
-
World Heart Day : గుండె జబ్బు వచ్చే ముందు ఈ చిన్న సంకేతాలు కనిపిస్తాయా.?
-
OTR : మేయర్ సీటు విషయంలో టీడీపీ ప్రయోగం చేస్తుందా?
-
Fahadh Faasil : ‘జై ఎన్టీఆర్’ అంటూ ఫాఫా.. తారక్‌తో ఆ రాత్రులు మరిచిపోలేనంటూ
-
Story Board : సైబర్ నేరాలు ఎందుకు పెరుగుతున్నాయి..?
-
Jr.NTR : కార్తికేయ నా తమ్ముడి లాంటోడు.. ఎన్టీఆర్ ఎమోషనల్ స్పీచ్
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!