NTV Telugu Site icon

Vallabhaneni Vamshi: సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీపై పోలీసులు ప్రశ్నాస్త్రాలు..

Vamshi Vallabhaneni

Vamshi Vallabhaneni

సత్యవర్ధన్ కిడ్నాప్ కేసులో వల్లభనేని వంశీని ముగ్గురు ఏసీపీలు విచారించారు. విచారణలో భాగంగా.. కీలకమైన ప్రశ్నలకు తనకు ఏమీ తెలియదని వంశీ సమాధానం చెప్పారు. వంశీకి 20కు పైగా ప్రశ్నలు సంధించారు అధికారులు. సత్యవర్ధన్ కిడ్నాప్ బెదిరింపుల కేసులో పలు ఆధారాలు పోలీసులు వంశీ ముందు ఉంచారు. తనకు ఈ కేసుకు ఏ సంబంధం లేదని తాను కిడ్నాప్ చేయలేదని తనకు ఏమి తెలియదని చెప్పారు వంశీ. దాదాపు మూడున్నర గంటల పాటు ముగ్గురు ఏసీపీలు వంశీని విచారించారు.

Read Also: Work-Week Debate: “పనిగంటల”పై క్యాప్‌జెమిని ఇండియా సీఈఓ కీలక వ్యాఖ్యలు..

పోలీస్ కస్టడీలో వంశీపై పోలీసులు ప్రశ్నల వర్షం కురిపించారు. తన ఫోన్ ఎక్కడ పెట్టానో గుర్తు లేదని వల్లభనేని వంశీ అధికారులకు తెలిపారు. తాను 3 ఫోన్స్ వాడుతున్నట్టు పోలీసులకి వంశీ చెప్పినట్టు సమాచారం. ఈ క్రమంలో.. ఫోన్ నంబర్లను వంశీ నుంచి సేకరించారు పోలీసులు. అరెస్టు సమయంలో ఫోన్ ఎక్కడ పెట్టానో.. మర్చిపోయానని వంశీ చెప్పినట్టు సమాచారం. అలాగే.. సత్యవర్ధన్ ను లిఫ్ట్ లో హైదరాబాద్ ఇంటికి తీసుకువెళ్లినట్టు వంశీ అంగీకరించారు. అతను సత్యవర్ధన్ అని తనకి తెలియదని పోలీసులకు వంశీ చెప్పినట్టు సమాచారం. హైదరాబాద్ నుంచి విశాఖ తన వాళ్లు తీసుకు వెళ్లారని ఎందుకో తనకి సమాచారం లేదని వంశీ పోలీసులకు చెప్పారు. కాగా.. 20కి పైగా ప్రశ్నలు పోలీసులు అడగ్గా అనేక ప్రశ్నలకు తనకు తెలీదని వంశీ సమాధానం ఇచ్చారు.

Read Also: Andhra Pradesh: ఎల్లుండి ఎమ్మెల్సీ ఎన్నికలు.. భారీగా భద్రతా ఏర్పాట్లు