Bhupathi Raju Srinivasa Varma: తిరుమల లడ్డూ వివాదంలో సుప్రీకోర్టు తీర్పును స్వాగతించారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ.. టీటీడీ లడ్డూ విషయంలో సుప్రీంకోర్టు తీర్పుని బీజేపీ స్వాగతిస్తుందన్న ఆయన.. టీటీడీ విషయంలో గతంలో అధికార పార్టీని బీజేపీ నిలదీయటం జరిగింది .. అంతర్వేది లక్ష్మీ నరసింహాస్వామి రథం తగలపెట్టిన ఘటనలో ఎలాంటి చర్యలు తీసుకోలేదు.. హిందూ వ్యతిరేక దాడులు గత ప్రభుత్వంలో చాలా జరిగాయి.. గత ప్రభుత్వంలో వైఎస్ జగన్ తిరుపతిలోనే నియమ నిబంధనలు పాటించలేదు.. సీఎం హోదాలో స్వామివారి పట్టు వస్త్రాలు సమర్పించేటప్పుడు జగన్ మోహన్ రెడ్డి హిందూ ధర్మాన్ని హేళన చేశారని మండిపడ్డారు.. ఇక, ఏడుకొండలని రెండు కొండలు చేస్తామని ఆనాడు వైస్సార్ చెప్పారు.. అన్యమతస్తులు వెళ్లటానికి ఇబ్బందులు లేవు.. కానీ, డిక్లరేషన్ అనేది ఇవ్వాలి అన్నారు శ్రీనివాస వర్మ.. శాస్త్రానికి, ధర్మానికి వ్యతిరేకంగా గత ప్రభుత్వ వైఖరి అవలంభించారని దుయ్యబట్టారు.. తిరుపతి విషయంలో హిందూ ఆరాధ్య దైవమైన స్వామి వారి పట్ల మీ వైఖరి సరైనిది కాదు అని హితవుపలికారు కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ..
Read Also: Harsha Sai Father: హర్ష సాయి తండ్రికి హైకోర్టు షాక్