Site icon NTV Telugu

YCP: సీఈఓను కలిసిన వైసీపీ బృందం.. చంద్రబాబు వ్యాఖ్యలపై ఫిర్యాదు

Malladi Vishnu

Malladi Vishnu

ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సీఈఓ ముకేష్ కుమార్ మీనాని వైఎస్సార్సీపీ బృందం కలిసింది. పాణ్యం, అనకాపల్లి సభల్లో సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఈసీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. పొరుగు రాష్ట్రంలో దుర్భాషలాడిన నేతలపై 48 గంటలు నిషేధం విధించిందని అన్నారు. చంద్రబాబు బరితెగించి మాట్లాడుతున్నా చర్యలు తీసుకోవటం లేదని ఆరోపించారు.

Karnataka: డిజిటల్ పేమెంట్లతో బీజేపీ గాలం వేసింది.. కాంగ్రెస్ ఆరోపణ

అసత్య ప్రచారాలతో చంద్రబాబు రాక్షస ఆనందం పొందుతున్నాడని మల్లాది విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చిన కేంద్రాన్ని బాబు, పవన్ ఎందుకు ప్రశ్నించడం లేదు..? ప్రశ్నించారు. 4 శాతం ముస్లిం రిజర్వేషన్ ఎత్తేస్తామంటున్న బీజేపీతో జతకట్టారని.. రాష్ట్ర ప్రయోజనాలు పక్కన పెట్టి కాళ్ళు మొక్కుతున్నారని విమర్శించారు. 2014లో కూటమి కట్టి విభజన చట్టాలను తుంగలో తొక్కారని ఆరోపించారు. ప్రత్యేక హోదాని ప్రత్యేక ప్యాకేజీగా మార్చేశారని దుయ్యబట్టారు. కూటమిని అడ్డుపెట్టుకొని పథకాలను అడ్డుకుంటూ.. అధికారులను టీడీపీ బదిలీ చేయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటమి భయంతోనే కూటమి అరాచకాలకు పాల్పడుతోందని పేర్కొన్నారు. అందుకే ఎన్నికలను సజావుగా సాగనిస్తారా అన్న అనుమానం సీఎం జగన్ వ్యక్తం చేసారన్నారు.

Murder: భార్య, కుమార్తెను చంపేసి ఆత్మహత్యాయత్నం చేసుకున్న భర్త.. విషమ పరిస్థితులలో కొడుకు..

విద్య, వైద్య, వ్యవసాయ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తెచ్చిన జగన్ వెంటే జనం ఉన్నారని మల్లాది విష్ణు తెలిపారు. చంద్రబాబు జుగుప్సాకరమైన పదజాలం వాడుతున్నారని.. జగన్ ను ప్రజలు పరిపాలనాధక్షుడిగా చూస్తున్నారని అన్నారు. చంద్రబాబు పదే పదే అబద్దాలు చెప్పి సీఎం జగనుపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. తనను అరెస్టు చేసి జైల్లో పెట్టారని సానుభూతి కోసం బాబు ప్రయత్నిస్తున్నారని.. స్కిల్ స్కాం బయట పడటం వల్లే చంద్రబాబు జైలుకు వెళ్లారని ఆరోపించారు. దాన్ని కప్పిపుచ్చుకుని.. ఆ నెపం ప్రభుత్వంపై వేస్తున్నారని మల్లాది విష్ణు పేర్కొన్నారు.

Exit mobile version