ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఆధ్వర్యంలో సీఈఓ ముకేష్ కుమార్ మీనాని వైఎస్సార్సీపీ బృందం కలిసింది. పాణ్యం, అనకాపల్లి సభల్లో సీఎం జగన్ పై చంద్రబాబు చేసిన అనుచిత వ్యాఖ్యలపై ఫిర్యాదు చేశారు. చంద్రబాబు చేసే తప్పుడు ప్రచారాలు, అసభ్య వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా.. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ, ఈసీ ఒక్కో రాష్ట్రానికి ఒక్కో విధంగా వ్యవహరిస్తోందని తెలిపారు. పొరుగు రాష్ట్రంలో దుర్భాషలాడిన నేతలపై 48 గంటలు నిషేధం విధించిందని…