AP Liquor Scam Case: ఏపీలో కలకలం రేపుతున్న లిక్కర్ స్కామ్ కేసుకు సంబంధించి సిట్ అరెస్టుల పరంపర కొనసాగిస్తుంది.. ఇప్పటికే కేసులో ఏ1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, ఏ8 చాణక్యను అరెస్టు చేసిన సిట్.. తాజాగా, ఏ6 శ్రీధర్ రెడ్డిని అరెస్టు చేసింది. దీంతో ఇకపై వరుసగా కేసులో అరెస్టులు ఉంటాయనే సంకేతాలు సిట్ ఇచ్చింది.. గత రెండు నెలలుగా లిక్కర్ కేసుకు సంబంధించి పూర్తిస్థాయి విచారణ చేపట్టిన సిట్.. ఇప్పుడు ఆ కేసులో అరెస్టులపై ఫోకస్ పెట్టింది. వరుసగా కేసులో నిందితులను అరెస్టు చేయడం చూస్తే ఇకపై కూడా అరెస్టుల పర్వం కొనసాగుతుందనే స్పష్టమైన సంకేతాలను సిట్ ఇస్తోందని అర్థమవుతుంది. కేసులో కీలకంగా వ్యవహరించి సిట్ విచారణకు హాజరుకాకుండా మొండి కేసిన కేసులో ఏ1 కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డితో అరెస్టులను మొదలు పెట్టింది. కసిరెడ్డి అరెస్టు జరిగిన రెండో రోజులకి అతని టీం లో ప్రధాన అనుచరుడుగా ఉన్న చాణిక్యను సిట్ అరెస్ట్ చేసింది..
Read Also: Chiranjeevi : మే9న మెగా ఫ్యాన్స్ కు పండగే.. అటు చిరు.. ఇటు చరణ్
ఇప్పుడు తాజాగా కసిరెడ్డికి సన్నిహితుడుగా ఉన్న ఎస్పీవై ఆగ్రోటెక్ సంస్థ యజమాని సజ్జల శ్రీధర్ రెడ్డిని కూడా అరెస్టు చేసింది.. దీంతో ఈ కేసులో ఇప్పటివరకు సిట్ అరెస్టు చేసిన వారి సంఖ్య మూడుకు చేరింది .. లిక్కర్ స్కాంలో అరెస్టయిన ఏ6 సజ్జల శ్రీధర్ రెడ్డి రిమాండ్ రిపోర్టులో కీలక అంశాలు పొందుపరిచింది.. కేసులో ఏ1గా ఉన్న కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డికి శ్రీధర్ రెడ్డి సన్నిహితుడని లిక్కర్ సిండి కేటులో కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. లిక్కర్ స్కాంలో ముడుపులు సిండికేట్ కు అందటంతో శ్రీధర్ రెడ్డి కీలక పాత్రగా పేర్కొంది. ప్రముఖ మద్యం బ్రాండ్లను రాష్ట్రంలో అనిచివేయటంలో శ్రీధర్ రెడ్డి కీలకమని పేర్కొంది. చట్ట విరుద్ధంగా లిక్కర్
ఆర్థర్ ఫర్ సప్లై (OFS) జారీ చేశారని మద్యం తయారీ, హోల్ సేల్, రిటైల్ ను ముడుపులు తీసుకొని నియంత్రించటం శ్రీధర్ రెడ్డి చేశారని సిట్ తెలిపింది. డిస్టలరీస్ ను సమన్వయం చేసి సకాలంలో సిండికేట్ సభ్యులకు ముడుపులు అందేలా చర్యలు తీసుకున్నారని తెలిపింది.. కేసులో ఇతర నిందితులు వాసుదేవ రెడ్డి, సత్య ప్రసాద్ లకు నచ్చిన కంపెనీలకు ఆర్థర్ ఫర్ సప్లై జారీ చేశారని పేర్కొంది.. ముడుపులు, కమిషన్ ద్వారా డబ్బు ఎలా సేకరించారు, ఏ కంపెనీలకు మళ్లించారు, ఆ డబ్బు ఎలా వినియోగించారు అనే వివరాలు శ్రీధర్ రెడ్డి దగ్గర ఉన్నాయని రిమాండ్ రిపోర్టులో పేర్కొంది సిట్..