Saikrishna Mother Vijayalakshmi: “నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?”.. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Saikrishna Mother Vijayalakshmi: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయికృష్ణ కేసులో మెజిస్ట్రియల్ విచారణ ముగిసిన అనంతరం అతని తల్లి విజయలక్ష్మి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విచారణ సందర్భంగా కేసుకు సంబంధించిన వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారని ఆమె తెలిపారు. తన కుమారుడి మరణానికి కారణమైన వారందరినీ గుర్తించి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. ఇక, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన విజయలక్ష్మి, తన కుమారుడు పవన్ కల్యాణ్‌కు అభిమానిగా ఉండేవాడని చెప్పారు. నిజాలు తెలుసుకోకుండా అతడిని క్రిమినల్‌గా చిత్రీకరించడం బాధాకరమని అన్నారు. తాము కాపు సామాజిక వర్గానికి చెందినవారమని, పవన్ కల్యాణ్‌ను నమ్మి ఓట్లు వేసి గెలిపించామని పేర్కొన్నారు.
ఈ కేసులో ఇంకా పలువురు వ్యక్తుల ప్రమేయం ఉందని ఆరోపించిన విజయలక్ష్మి, తన కుమారుడిని ఇంటి నుంచి తీసుకెళ్లిన వారిని ఇప్పటికీ అరెస్ట్ చేయలేదని విమర్శించారు. వారందరినీ చట్టం ముందు నిలబెట్టి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే తన కుమారుడి బూడిదను తనకు అప్పగించాలని కోరుతూ, బూడిద ఇవ్వకపోతే ఆత్మాహుతికి పాల్పడతానని హెచ్చరించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న బూడిద నిజంగా తన కుమారుడిదేనని ఎలా నిర్ధారిస్తారని ప్రశ్నించారు. కేసులో నిష్పాక్షిక దర్యాప్తు జరిపి పూర్తి నిజాలు బయటపెట్టాలని, బాధ్యులందరిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు సాయి కృష్ణ తల్లి విజయలక్ష్మి..
Also Read
- Vijayawada Crime: స్నాప్‌లో పరిచయం.. చనిపోతానంటూ బెదిరింపులు.. యువతి నుంచి రూ.1.38 కోట్లు వసూలు
- VMC Contractors Strike: వీఎంసీ కాంట్రాక్టర్లతో మంత్రి నారాయణ చర్చలు సఫలం.. సమ్మె విరమణ
- Nara Lokesh: యువత ఇతర రాష్ట్రాలకు వెళ్లొద్దు.. మన అమరావతి, విశాఖ, కర్నూలులోనే ఉద్యోగాలు..
- Sai Krishna Death Case: సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో మరో కీలక అరెస్ట్
తాజావార్తలు
-
Elephant Death: విద్యుత్ షాక్‌తో ఏనుగు మృతి.. పవన్ కల్యాణ్ సీరియస్.. కీలక ఆదేశాలు
-
Sofa Cleaning Tips: సోఫాపై మొండి మరకలా? ఈ ఇంటి చిట్కాతో సులభంగా క్లీన్ చేయండి
-
OTR: కవిత మాటలు నిజామాబాద్ పాలిటిక్స్‌లో మంటలు రేపుతున్నాయా..?
-
Off The Record: వైసీపీ నేతలకు రిపోర్ట్ కార్డ్స్ పెట్టారా..? ఫెయిల్ అయిన నేతలకు నో టికెట్..?
-
US-Iran: రెండేళ్లలో ‘హార్ముజ్’ విలువలేనిదిగా మారొచ్చు.. ఇరాన్‌పై కఠిన ఆంక్షలకు అమెరికా ప్లాన్
ట్రెండింగ్
-
PhonePe UPI 123Pay: ఫీచర్ ఫోన్లలోనూ UPI పేమెంట్స్.. ఇంటర్నెట్ లేకుండానే PhonePe సేవలు.!
-
Glenn Phillips Catch: ఒంటిచేత్తో ఊహించని క్యాచ్.. నేనేనా పట్టింది అంటూ షాకైన గ్లెన్ ఫిలిప్స్.. వీడియో తప్పక చూడాల్సిందే!
-
AMOLED డిస్ప్లే, 66W ఫాస్ట్ ఛార్జింగ్, 50MP కెమెరాతో Lava AGNI 4N లాంచ్.!
-
IBPS RRB Recruitment: ఉద్యోగార్థులకు శుభవార్త.. బ్యాంకింగ్ రంగంలో 13,706 ఉద్యోగాల జాతర.!
-
Navagraha Pradakshina: నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశాక కాళ్లు కడుక్కోవాలా? అసలు రహస్యం ఇదే..!