Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Krishna Lockup Death Case: విజయవాడలో సంచలనం సృష్టించిన సాయి కృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్‌బాబు, విజయవాడ సౌత్ జోన్ అసిస్టెంట్ కమిషనర్ (ఏసీపీ) ఎం. మానసలను నిందితులుగా చేర్చాలని కోరుతూ విజయవాడ రెండో అదనపు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టులో ప్రైవేట్ ఫిర్యాదు దాఖలైంది. ఈ రోజు అనగా.. జూలై 21న తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి తరఫున సీనియర్ న్యాయవాది పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఈ పిటిషన్‌ను కోర్టులో సమర్పించారు. పిటిషన్లో ఏపీ డీజీపీ హరీష్ కుమార్ గుప్తాను ఏ-1, విజయవాడ పోలీస్ కమిషనర్ ఎస్.వి. రాజశేఖర్‌బాబును ఏ-2, విజయవాడ సౌత్ జోన్ ఏసీపీ ఎం. మానసను ఏ-3గా పేర్కొన్నారు.
పిటిషన్లో చేసిన ఆరోపణల ప్రకారం, సాయి కృష్ణను అదుపులోకి తీసుకున్న సమయం నుంచి ఆయన అదృశ్యం కావడం, అనంతరం మరణించే వరకు జరిగిన పరిణామాలపై ఉన్నతాధికారులకు పూర్తి సమాచారం ఉందని పేర్కొన్నారు. అలాగే మే 6న మార్కాపురంలో సాయి కృష్ణను విజయవాడ పోలీస్ కమిషనరేట్ టాస్క్ ఫోర్స్ బృందమే అదుపులోకి తీసుకుందని పిటిషన్లో ప్రస్తావించారు. టాస్క్ ఫోర్స్ నేరుగా విజయవాడ పోలీస్ కమిషనర్ ఆధీనంలో పనిచేస్తున్నందున అరెస్టు విషయం కమిషనర్‌కు తెలియదని చెప్పడం సాధ్యం కాదని పిటిషనర్ వాదించారు. ఈ నేపథ్యంలో ఉన్నతాధికారుల పాత్రపై సమగ్ర విచారణ జరిపి వారిని కూడా కేసులో నిందితులుగా చేర్చాలని కోర్టును కోరారు. అయితే, ఈ ప్రైవేట్ ఫిర్యాదుపై కోర్టు ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఈ కేసులో తదుపరి విచారణ, కోర్టు ఆదేశాలు కీలకంగా మారనున్నాయి.
Also Read
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్‌ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
- Chinta Mohan: అయోధ్య అవినీతిపై సీబీఐ విచారణ జరపాలి.. కేంద్ర మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
- Saikrishna Mother Vijayalakshmi: "నా కొడుకు పవన్ కళ్యాణ్ అభిమాని.. క్రిమినల్ అని ఎలా అంటారు?".. సాయికృష్ణ తల్లి ఆగ్రహం..
తాజావార్తలు
-
Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
-
PM Modi: “నీట్ పేపర్ లీక్ ‘ఘోర పాపం’.. కఠిన శిక్ష తప్పదు”.. ప్రధాని మోడీ సీరియస్ వార్నింగ్
-
Realme Power Days సేల్.. P4 Power 5G, P4 Pro 5Gపై భారీ తగ్గింపు.. ఆఫర్లు ఇవే.!
-
Maruthi Next : మారుతీ డైరెక్షన్ లో వరుణ్ తేజ్.. అవసరమా అధ్యక్ష్యా?
-
Tattoo Trends 2026: టాటూ ప్లేస్మెంట్ ఎందుకు ముఖ్యం..? 2026లో మారుతున్న కొత్త ట్రెండ్ ఇదే
ట్రెండింగ్
-
Rohit Sharma Retirement: రోహిత్ మనసులో రెండు గాయాలు.. అందుకే రిటైర్ కాలేదు.. మరి ఎప్పుడు?
-
SAIL Recruitment: పరీక్ష లేకుండానే 1,110 అప్రెంటిస్ పోస్టులు.. దరఖాస్తు ఎక్కడ చేసుకోవాలంటే.?
-
Ferrari Amalfi Spider: ఫెరారీ కొత్త కన్వర్టిబుల్ సూపర్‌కార్ లాంచ్.. ధర ఎంతంటే?
-
Rohit Sharma: మజా ఉండదు కదా.. రిటైర్మెంట్ వార్తలపై తొలిసారి స్పందించిన రోహిత్ శర్మ!
-
Mahindra New SUV: ఆగస్టు 15న మహీంద్రా నుంచి కొత్త SUV.. స్కార్పియో N ఫేస్‌లిఫ్ట్ ఎంట్రీ ఖాయమేనా?