NTV Telugu Site icon

Kesineni Nani: కేశినేని భవన్కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగింపు..

Kesineni Bavan

Kesineni Bavan

బెజవాడలో కేశినేని భవన్ కు ఉన్న టీడీపీ, చంద్రబాబు ఫ్లెక్సీలు తొలగించారు. టీడీపీ, చంద్రబాబు ఇతర నేతల ఫోటోలతో ఉన్న ఫ్లెక్సీలు తీసేశారు సిబ్బంది. కేవలం.. కేశినేని నాని, ఆయన కుమార్తె కేశినేని శ్వేత ఫోటోలతో కూడిన ఫ్లెక్సీలు మాత్రమే ఉంచారు. కేశినేని పార్టీ మారుతారంటూ వార్తలు వస్తున్న నేపథ్యంలో టీడీపీ, చంద్రబాబు ఫోటోలతో ఉన్న ఫెక్లీలను తొలగించారు.

Nandigama Suresh: వెన్నుపోట్లతో రాజకీయాల్లోకి వచ్చిన వ్యక్తి చంద్రబాబు..

తాను ఎంపీ పదవితో పాటు టీడీపీకి రాజీనామా చేయనున్నట్లు బెజవాడ ఎంపీ కేశినేని నాని ప్రకటించిన సంగతి తెలిసిందే. త్వరలోనే లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామా చేయడంతో పాటు.. తెలుగుదేశం పార్టీకి కూడా రాజీనామా చేయనున్నట్టు సోషల్‌ మీడియా వేదికగా ప్రకటించిన విషయం విదితమే.. త్వరలో లోక్ సభ సభ్యత్వానికి, ఆ వెంటనే పార్టీకి రాజీనామా చేస్తానని కేశినేని ట్వీట్ చేశారు.. నా అవసరం లేదని చంద్రబాబు భావించారు. ఇంకా నేను పార్టీలో కొనసాగడం కరెక్ట్ కాదని తన ట్వీట్‌లో రాసుకొచ్చారు. ”చంద్రబాబు నాయుడు గారు పార్టీకి నా అవసరం లేదు అని భావించిన తరువాత కుడా నేను పార్టీలో కొనసాగటం కరెక్ట్ కాదు అని నా భావన.. కాబట్టి త్వరలోనే ఢిల్లీ వెళ్లి లోకసభ స్పీకర్ గారిని కలసి నా లోకసభ సభ్యత్వానికి రాజీనామా చేసి.. ఆ మరుక్షణం పార్టీకి రాజీనామా చేస్తానని అందరికీ తెలియ చేస్తన్నాను” అంటూ తన ట్వీట్‌లో రాసుకొచ్చారు.

Music Maestro Rashid Khan: మ్యూజిక్ మ్యాస్ట్రో రషీద్ ఖాన్ కన్నుమూత

మరోవైపు.. విజయవాడ మేయర్‌ని కలిసి కార్పొరేట్‌ పదవికి రాజీనామా చేస్తానని కేశినేని నాని కూతురు కేశినేని శ్వేత తెలిపారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేయనున్నట్టు ప్రకటించారు. ఎంపీ కేశినేని నాని వ్యవహారంలో ముందుగా ఆయన కుమార్తె శ్వేత రాజీనామా చేస్తున్నారు. ఇక, గత మున్సిపల్ ఎన్నికల్లో శ్వేతకు మేయర్ పదవి విషయంలో కేశినేని నాని అసంతృప్తి మొదలైందని చెబుతుంటారు.. బెజవాడలో టీడీపీ గెలిస్తే శ్వేత కు మేయర్ పదవి ఇవ్వాలని ఎంపీ కేశినేని నాని పట్టుబట్టగా.. శ్వేత కు మేయర్ పదవి ఇవ్వొద్దని మరో వర్గం వ్యతిరేకించింది.. ఆ తర్వాత కేశినేని టీడీపీకి దూరమయ్యారనే వార్తలు వచ్చినా.. పార్టీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌ తర్వాత.. కాస్త యాక్టివ్‌గానే పనిచేశారు.. ఆ తర్వాత కేశినేని బ్రదర్స్‌ వ్యవహారంలో టీడీపీ అధిష్టానం చేసిన సూచనలతో.. రాజీనామాకు కేశినేని నాని సిద్ధమవుతోన్న విషయం విదితమే.