Site icon NTV Telugu

PVN Madhav: బీజేపీ ఏపీ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన మాధవ్‌.. లెనిన్‌ సెంటర్‌పై సంచలన వ్యాఖ్యలు..

Pvn Madhav

Pvn Madhav

PVN Madhav: బీజేపీ ఆంధ్రప్రదేశ్‌ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించారు పీవీఎన్‌ మాధవ్… విజయవాడలోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. నా కంటే ముందు అధ్యక్షులైన వారి శక్తి యుక్తులతో ముందుకు వెళ్తాను అన్నారు.. ప్రతీ కార్యకర్త తానే అధ్యక్షుడయ్యానని అన్నంతగా పని చేస్తున్నారు.. రాష్ట్రంలో అరాచక పాలనకు చరమగీతం పలుకుతూ ఒక నిర్ణయాన్నిచ్చారని పేర్కొన్నారు.. బీజేపీ ఇచ్చిన ఈ పదవిని గౌరవంగా భావించి పని చేస్తాను.. డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ కు నివాళులర్పించాను.. కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణకు నివాళులు అర్పించాను… రాష్ట్రానికి శాసనభాషగా తెలుగు ఉండాలని అని ఒక శాసన నిఘంటువు తయారు చేసిన విశ్వనాథ సత్యనారాయణ కు నివాళుర్పించాను అని పేర్కొన్నారు మాధవ్..

Read Also: Drug Rocket: మహిళల హైహీల్స్‌లో డ్రగ్స్.. భారీగా డ్రగ్ రాకెట్ గుట్టు రట్టు చేసిన ఈగల్ టీం..!

అయితే, ఏపీ బీజేపీ అధ్యక్ష బాధ్యతలు స్వీకరించడానికి ముందు.. తుమ్మలపల్లి కళాక్షేత్రం వద్ద బీఆర్‌ అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించిన మాధవ్.. అనంతరం ర్యాలీగా బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్నారు.. ఆయన వెంట భారీ సంఖ్యలో బీజేపీ శ్రేణులు తరలివచ్చారు.. ఇక, కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ విగ్రహానికి పుష్ప మాల వేసి బాధ్యతల స్వీకార కార్యక్రమానికి బయలుదేరారు.. పీవీఎన్‌ మాధవ్.. అయితే, ఈ సందర్భంగా పుస్తకప్రియులకు స్వర్గధామంగా ఉన్న విజయవాడలోని లెనిన్‌ సెంటర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు.. లెనిన్ కి భారత దేశానికి ఎటువంటి సంబంధం లేదన్న ఆయన.. విశ్వనాథ సత్యనారాయణ విగ్రహం చుట్టూ మంచి వాతావరణం నిర్మాణం చేయాలి, వారి పట్ల నిర్లక్ష్యం తగదు అన్నారు.. ఇక మీదట ఇది లెనిన్ సెంటర్ కాదు.. కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ సెంటర్‌గా పిలవాలి అంటూ వ్యాఖ్యానించారు పీవీఎన్‌ మాధవ్..

Read Also: EBOO Therapy Treatment: డాక్టర్ ధీరజ్ ‘పెయిన్ రిలీఫ్ & వెల్‌నెస్ సెంటర్’లో EBOO థెరపీ ప్రారంభం

ఇక, సంస్ధాగతంగా సభ్యత్వాలు, ఎన్నికలు సంపూర్ణంగా జరిగాయి.. బీజేపీ ప్రతీ కార్యకర్త అంకిత భావంతో పని చేయడం వల్ల 25 లక్షల సభ్యత్వం చేరుకున్నాం అన్నారు బీజేపీ ఎంపీ పురంధేశ్వరి.. బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం ఆధారంగా అన్నిస్ధాయిలలో అధ్యక్షుల ఎన్నిక జరిగింది.. జాతీయ కౌన్సిల్ మెంబర్ల నియామకం కూడా జరిగింది.. మాధవ్ తండ్రి చలపతిరావు గారు పోరాట పటిమ కలిగిన వ్యక్తి.. ఎమర్జెన్సీలో కూడా చలపతిరావు దంపతులు జైలుకు వెళ్ళారు.. సంస్ధాగత అంశాల పట్ల పూర్తి అవగాహన కలిగిన వ్యక్తి మాధవ్ అని పేర్కొన్నారు.. కార్యకర్తలు అందరూ బిజెపి కుటుంబసభ్యులు.. రెండు సంవత్సరాల నా ప్రస్ధానంలో నాకు సహకారం అందించిన వారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలిపారు పురంధేశ్వరి..

Read Also: OnePlus Nord CE5: 7100mAh భారీ బ్యాటరీ, 50MP కెమరాతో వన్ ప్లస్ నార్డ్ CE5 లాంచ్.. ధర, ఫీచర్స్ ఇలా..!

ఇక, రాష్ట్ర కార్యకర్తలు అందరూ మాధవ్ ని అధ్యక్షుడిగా స్వాగతిస్తున్నారు.. మాధవ్ అధ్యక్షుడుగా ప్రకటన జరిగాక పాజిటివ్ వైబ్రేషన్స్ వచ్చాయి అన్నారు బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు.. రాష్ట్రంలో బీజేపీని మంచి స్ధాయికి తీసుకెళ్ళే పరిస్థితులు ఉన్నాయి.. అన్ని రాష్ట్రాల్లో బలోపేతం అవ్వడమే బీజేపీ ప్రధాన లక్ష్యంగా పేర్కొన్నారు ఎమ్మెల్సీ సోము వీర్రాజు..

Exit mobile version