NTV Telugu Site icon

New Year Celebrations: బెజవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు..

Vijayawada Cp

Vijayawada Cp

విజయవాడలో న్యూ ఇయర్ వేడుకలపై పోలీసుల ఆంక్షలు విధించనున్నారు. ఈ క్రమంలో.. 31వ తేదీ రాత్రి నగరంలో ఫ్లై ఓవర్లు, పశ్చిమ బైపాస్ పై ట్రాఫిక్ నిలిపివేస్తూ నిర్ణయం తీసుకున్నారు. నగర వాసులకు విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్ధరాత్రి రోడ్డు మీద వేడుకలకు అనుమతులు లేదు.. రాత్రి 11 గంటల తరువాత వాహనాలు నడుపు వ్యక్తి అతి వేగంగా, అజాగ్రత్తగా వాహనం నడప రాదని తెలిపారు. అలాగే.. ట్రిపుల్ రైడింగ్ చేసి వాహనం నడుప రాదు.. మద్యం సేవించి వాహనాలు నడుప రాదని అన్నారు. ప్రధాన రహదారులు అయిన బందర్ రోడ్డు, ఏలూరు రోడ్డు, బి.ఆర్.టి. ఎస్. రోడ్ల పై పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షలు విధించబడునని సీపీ చెప్పారు.

Read Also: Taliban: పాకిస్తాన్‌పై తాలిబన్ రక్షణ శాఖ సంచలన ప్రకటన..

బెంజ్ సర్కిల్ ఫ్లైఓవర్లు (కొత్త, పాత), కనక దుర్గా ఫ్లైఓవర్లపై ట్రాఫిక్ అనుమతించబడదని నగర పోలీస్ కమిషనర్ రాజశేఖర్ బాబు సూచించారు. వెస్ట్ బైపాస్ రోడ్డులో ప్రయాణానికి పూర్తిగా ఆంక్షలు విధించడమైనదని చెప్పారు. కాబట్టి అటువైపు ఎవరు వెళ్ళరాదు.. నూతన సంవస్సర వేడుకలు జరుపుకోరాదని తెలిపారు. గుంపులు గుంపులుగా చేరి నడి రోడ్డుపై కేకులు కోసి అల్లర్లు చేయరాదని వెల్లడించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రివేళ కేకలు వేస్తూ వాహనాలపై తిరుగ రాదని అన్నారు.

Read Also: MLC Kavitha: కేసీఆర్‌ను ఎదుర్కొనే దమ్ములేక.. నాపై, కేటీఆర్ పై అక్రమ కేసులు పెట్టారు..

హద్దుమీరి ప్రవర్తిస్తే చర్యలు తప్పవని సీపీ రాజశేఖర్ బాబు హెచ్చరించారు. డిసెంబర్ 31వ తేదీ రాత్రివేళ నగరంలో గస్తీ ముమ్మరంగా ఉంటుంది.. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని అన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపిన వారిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ద్విచక్ర వాహనాలకు సైలంసర్ తీసివేసి అధిక శబ్దాలతో హోరేత్తించడం.. అతి వేగంతో రోడ్లపై తిరగటం.. వాహనములు నడుపుతూ విన్యాసాలు ప్రదర్శించడం.. బాణాసంచా పేల్చడం వంటి చేయవద్దని సీపీ రాజశేఖర్ బాబు తెలిపారు.

Show comments