Site icon NTV Telugu

Gorantla Madhav: గోరంట్ల మాధవ్‌కు మరో నోటీసు..

Gorantla Madhav

Gorantla Madhav

Gorantla Madhav: వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఈరోజు విజయవాడ సైబర్ పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. పోలీసుల అడిగిన ప్రతి ప్రశ్నకు సమాధానం ఇచ్చానని, విచారణ ప్రక్రియకు పూర్తి సహకారం అందిస్తున్నానని చెప్పారు. మరోసారి నోటీస్ ఇస్తే కూడా హాజరవుతానని స్పష్టంచేశారు. పోక్సో కేసుకు సంబంధించిన విషయంలో, బాధితురాలి పేర్లు చంద్రబాబు, పవన్ కల్యాణ్, లోకేష్ సహా మరికొందరు రాజకీయ నేతలు ప్రస్తావించారు అన్నారు. ఈ అంశంపై తాను అధికారికంగా ఫిర్యాదు చేస్తానని, చట్టం అందరికీ సమానంగా ఉండాలని అంటున్నారు మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..

Read Also: Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త.. అన్నప్రసాదం మెనూలో అదనంగా చేరిన గారె..

కేసులు అడ్డం పెట్టి వైఎస్‌ జగన్‌ని ఆపాలని చూస్తే.. మూతిని అడ్డం పెట్టి సూర్యుని ఆపాలని చూడడమే వ్యాఖ్యానించారు గోరంట్ల మాధవ్.. 1970లో ఇందిరా గాంధీ పెట్టిన ఎమర్జెన్సీని.. ఇప్పుడు చంద్రబాబు నాయుడు తన పాలనతో గుర్తు చేస్తున్నారని దుయ్యబట్టారు.. కూర్చున్నా.. నిల్చున్నా.. మీటింగ్ పెట్టినా.. మాట్లాడినా.. అరెస్టులు చేస్తున్నారు.. అభివృద్ధిని పక్కన పెట్టి అరెస్టులపై చంద్రబాబు దృష్టి పెడుతున్నారని ఎద్దేవా చేశారు.. బావ ప్రకటన స్వేచ్ఛ ని హరించి వేస్తున్నారన్న ఆయన.. తప్పుడు కేసులు, అరెస్టులకు వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేతలు భయపడరని స్పష్టం చేశారు.. ఎన్నికల్లో వైస్సార్సీపీ ఓడింది లేదు.. చంద్రబాబు గెలిచేది లేదన్నారు.. అయితే, ఈ రోజు కేసు విచారణ ముగిసింది.. కానీ, పోలీసులు మరో నోటీసు ఇచ్చినట్టు వెల్లడించారు వైసీపీ నేత, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్..

Exit mobile version