Site icon NTV Telugu

Jogi Ramesh: మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటికి పోలీసులు..

Jogi

Jogi

Jogi Ramesh: నకిలీ మద్యం కేసులో వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్‌ ఇంటి వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇబ్రహీంపట్నంలోని జోగి రమేష్‌ ఇంటి వద్దకు తెల్లవారుజామునే భారీగా పోలీసులు వెళ్లారు. ఈ క్రమం‍లో జోగి రమేష్‌ ఇంటి దగ్గరు వైఎస్సాఆర్‌ కాంగ్రెస్ పార్టీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో చేరుకున్నారు.

Read Also: Daily Astrology: ఆదివారం దిన ఫలాలు.. ఆ రాశి వారు జాగ్రత్త!

అయితే, నకిలీ మద్యం కేసులో నిందితుడు ఏ1 జనార్థనరావు స్టేట్‌మెంట్ ఆధారంగా జోగి రమేష్‌ పేరును చెప్పినట్లుగా తెలుస్తుంది. కాగా, ఇప్పటికే నకిలీ మద్యం కేసులో సీబీఐ విచారణ జరపాలని జోగి రమేష్ హైకోర్టులో పిటిషన్‌ వేశారు. ఈ పిటిషన్ ను వచ్చే మంగళవారం నాడు విచారణ చేయనున్న న్యాయస్థానం.

Exit mobile version