విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ నెల 2వ తేదీన బుక్ ఫెస్టివల్ ను డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఈ పుస్తక మహోత్సవం రేపటితో ముగియనుంది. పుస్తక మహోత్సవం ప్రతి రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు కొనసాగుతుంది. మూడున్నర దశాబ్దాలుగా విజయవాడలో ఏటా పుస్తక మహోత్సవం నిర్వహిస్తోన్నారు. అయితే.. ఈ రోజు ఉదయం డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ పుస్తక మహోత్సవాన్ని ప్రత్యేకంగా సందర్శించారు. తన కోసం ప్రత్యేకంగా ఉదయం పూట రెండు గంటలు స్టాల్స్ ఓపెన్ చేయాలని పవన్ విజ్ఞప్తి చేయడంతో నిర్వాహకులు అంగీకరించారు. కల్యాణి పబ్లికేషన్స్, తెలుగు ఇస్లామిక్ పబ్లికేషన్స్ సహా మరికొన్ని స్టాళ్లను పవన్ సందర్శించారు.. అనంతరం.. 6, 9 తరగతులు పుస్తకాలు, డిక్షనరీ, ఎకనామిక్స్, ఫైనాన్స్ పుస్తకాలతో పాటుగా తెలుగులో అనువదించిన ఖురాన్ గ్రంథంతో పాటు చాలా పుస్తకాలను కొనుగోలు చేశారు. రూ.10 లక్షలు విలువ చేసే పుస్తకాలను ఆయన కొనుగోలు చేయడం విశేషం. పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంలో యువత కోసం ఓ మంచి లైబ్రరీ ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అందు కోసమే ఇన్ని డబ్బులు వెచ్చించి మరీ భారీగా పుస్తకాలు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
Read Also: MG Windsor EV: దేశంలోని నంబర్-1 ఎలక్ట్రిక్ కారు.. ఇండియన్ గ్రీన్ కార్ ఆఫ్ ది ఇయర్ 2025 విజేత..
తనకు జీవితంలో నిలబడే ధైర్యాన్నిచ్చింది పుస్తకాలే అని ఈ పుస్తకమహోత్సవాన్ని ప్రారంభించిన సందర్భంగా పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే.. తన తల్లిదండ్రుల వల్ల పుస్తక పఠనం అలవాటైందని, రూ.కోటి ఇవ్వడానికి ఆలోచించను గానీ పుస్తకం ఇచ్చేందుకు ఆలోచిస్తానని చెప్పుకొచ్చారు. పుస్తకం ఇవ్వాలంటే తన సంపద ఇచ్చినంత మదనపడతానని.. కొందరు పుస్తకాలు అడిగితే కొనిస్తా గానీ తన వద్ద ఉన్న పుస్తకాలు ఇవ్వనని చెప్పారు. పుస్తక పఠనం లేకపోతే జీవితంలో ఏమయ్యేవాడినో అనిపిస్తుందని, తాను కోరుకుంటున్న చదువు పుస్తకాల్లో లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించిన విషయం విదితమే..
Read Also: Venkatesh: అలాంటి సీన్స్ చేయడం చాలా ఎంజాయ్ చేశా: వెంకటేష్ ఇంటర్వ్యూ