NTV Telugu Site icon

Prakasam Barrage: ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్న ఘటనలో కుట్ర కోణం.. సీఎంకు నివేదిక..

Cbn

Cbn

Prakasam Barrage: విజయవాడను వరదల అతలాకుతలం చేశాయి.. ఓవైపు బుడమేరు.. మరోవైపు కృష్ణానదిలో వరద ప్రవాహం పెరగడంతో.. విజయవాడలోని చాలా కాలనీలు వరదనీటిలో మునిగిపోయాయి.. అయితే, ఇదే సమయంలో.. కృష్ణా నదిలో బోట్లు వచ్చి.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టడం సంచలనంగా మారింది.. ఈ బోట్లు సృష్టించిన విధ్వంసంతో .. ప్రకాశం బ్యారేజీకి చెందిన 67, 69, 70 గేట్లు దెబ్బతిన్నాయి.. దీని కోసం ఆ గేట్లను కౌంటర్ వెయిట్లు ఏర్పాటు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.. మరోవైపు.. ఈ ఘటనపై కేసు నమోదు చేశారు.. ఇంకో వైపు ప్రకాశం బ్యారేజీకి బోట్లు ఢీ-కొన్న ఘటనపై సీఎం చంద్రబాబుకు నివేదిక చేరింది.. బ్యారేజీకి బోట్లు ఢీకొన్న సంఘటనలో కుట్ర కోణం ఉందని నివేదికలో వెల్లడించారు అధికారులు..

Read Also: Manipur Violence: మణిపూర్‌లో హింసకు వ్యతిరేకంగా నిరసనకారుల ర్యాలీ.. టియర్ గ్యాస్ ప్రయోగించిన పోలీసులు

ఇప్పటి వరకు ఈ బోట్లు తమవేనని ఎవ్వరూ రాకపోవడమే కుట్ర కోణం ఉందనడానికి నిదర్శనమన్న నివేదికలో పేర్కొన్నారు అధికారులు.. బ్యారేజీని ఢీకొన్న బోట్లు వైసీపీ నేతలు.. కార్యకర్తలవని నివేదికలో నిర్ధారించారు. వైసీపీ ఎమ్మెల్సీ తలశిల రఘురాం, వైసీపీ మాజీ ఎంపీ నందిగం సురేష్‌ అనుచరుల బోట్లుగా గుర్తించినట్టు నివేదికలో వెల్లడించారు. ఇసుక అక్రమ తవ్వకాలకు నందిగం సురేష్ ఉషాద్రికి చెందిన బోట్లనే వినియోగించుకునేవారని నివేదికలో పేర్కొన్నారు.. బోట్ల రిజిస్ట్రేషన్ల నెంబర్ల ద్వారా యజమానులను గుర్తించినట్టు తెలిపారు.. AP-IV-M-SB-0022, AP-IV-M-SB-0023, AP-IV-M-SB-0017 నెంబర్లున్న బోట్లతో పాటు.. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టాయి మరో రెండు బోట్లు. ఉషాద్రి, కర్రి నరసింహా స్వామి, గూడూరు నాగమల్లేశ్వరీల బోట్లుగా గుర్తించారు. ఉషాద్రికి చెందిన మూడు బోట్లను కలిపి కట్టడం వెనుక కుట్ర కోణం ఉందన్న నివేదికలో వెల్లడించారు.

Read Also: 16th Finance Commission: నేడు, రేపు రాష్ట్రంలో పర్యటించనున్న 16వ ఆర్థిక సంఘం..

ఇక, సహజంగా మూడు బోట్లను కలిపి కట్టరని నివేదికలో స్పష్టం చేశారు అధికారులు.. ఇనుప చైన్లతో కాకుండా.. ప్లాస్టిక్ రోప్స్‌తో బోట్లను కట్టేసినట్టు గుర్తించారు.. తాము హెచ్చరిస్తున్నా ఇనుప చైన్లతో బోట్లను కట్టలేదని స్థానికులు చెప్పారని నివేదికలో వెల్లడించారు.. తమ బోట్లతో పాటు.. సమీపంలోన మరో రెండు బోట్లు కూడా కొట్టుకెళ్లేలా ప్లాన్ చేశారని నివేదికలో చెప్పుకొచ్చారు అధికారులు. కాగా, ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొన్ని ఘటనలో కుట్ర కోణం ఉందని ఆది నుంచి మంత్రులు, టీడీపీ నేతలు ఆరోపిస్తూ వచ్చారు.. ముఖ్యంగా మంత్రులు నిమ్మల రామనాయుడు, కొల్లు రవీంద్ర లాంటి మంత్రులు ఈ ఘటనపై సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం విదితమే.