Vallabhaneni Vamsi Case: వైసీపీ నేత, గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ కేసులో కీలక పరిణామలు చోటు చేసుకున్నాయి.. సత్య వర్ధన్ ను రెండవ జూనియర్ సివిల్ జడ్జి కోర్టుకి తీసుకెళ్లారు పటమట పోలీసులు.. మెజిస్ట్రేట్ ఎదుట సత్య వర్ధన్ 164 స్టేట్ మెంట్ రికార్డు చేశారు.. టీడీపీ గన్నవరం కార్యాలయంపై దాడి కేసులో ఈ నెల 10వ తేదీన సత్యవర్ధన్ కేసు వాపస్ తీసుకున్న విషయం విదితమే కాగా.. కేసు వెనక్కి తీసుకోవాలని వంశీ.. సత్యవర్ధన్ ను బెదిరించారని నమోదైన కేసులో తాజాగా మరోసారి మెజిస్ట్రేట్ ఎదుట సత్యవర్ధన్ స్టేట్ మెంట్ రికార్డు చేశారు..
Read Also: Top Headlines @ 5 PM: టాప్ న్యూస్
మరోవైపు.. వల్లభనేని వంశీ మోహన్ కేసులో కస్టడీ, బెయిల్ పిటిషన్లు విచారణకు స్వీకరించింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ కోర్టు.. అనారోగ్యం కారణంగా బెడ్ తోపాటు ఇంటి నుండి ఆహారం ఇచ్చేందుకు అనుమతి ఇవ్వాలని దాఖలైన పిటిషన్ కూడా విచారణకు స్వీకరించింది న్యాయస్థానం.. ఈ వ్యవహారంలో ఇరు పక్షాలు నోటీసులు జారీ చేయాలని న్యాయమూర్తి పేర్కొన్నారు.. ఇక, సత్య వర్ధన్ కిడ్నాప్ కేసులో వంశీని పదిరోజుల పాటు కస్టడీకి కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు పోలీసులు. అయితే, రిమాండ్ లో ఉన్న వంశీకి బెయిల్ కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు వంశీ తరపు న్యాయవాదులు.. నోటీసులపై రేపు కౌంటర్ దాఖలు చేయనున్నాయి ఇరు వర్గాలు..
Read Also: Hyderabad: ‘మీ ఆవిడని నాకిచ్చేయ్’.. ప్రియురాలి భర్తతో ప్రియుడు గొడవ
ఇక, ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో వల్లభనేని వంశీ ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు.. గన్నవరం పోలీస్ స్టేషన్ పరిధిలో రంగబాబు అనే వ్యక్తిపై దాడికి పాల్పడిన కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలని పిటిషన్ వేశారు వంశీ.. ఈ పిటిషన్ హైకోర్టు రేపు విచారణ జరిపే అవకాశం ఉంది.. మరోవైపు.. రేపు వల్లభనేని వంశీని పరామర్శించనున్నారు వైసీపీ అధినేత వైఎస్ జగన్.. విజయవాడ జిల్లా జైలులో కిడ్నాప్ కేసులో రిమాండ్ లో ఉన్న వల్లభనేని వంశీని ఆయన రేపు కలుస్తారు.. ఇప్పటికే వంశీ భార్య పంకజశ్రీని ఫోన్‌లో పరామర్శించిన జగన్ ఆమెకు భరోసా ఇచ్చారు.. వంశీ అరెస్ట్ రోజు జరిగిన పరిణామాలను అడిగి తెలుసుకున్నారు జగన్.. రేపు ఉదయం 10.30కి పలువురు వైసీపీ నేతలతో కలసి ఆయన జైలుకు వెళ్లి ములాఖత్ లో వంశీని పరామర్శించనున్నారు.. మొత్తంగా వల్లభనేని వంశీ కేసులో ఈ రోజు కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి..