NTV Telugu Site icon

Minister Nimmala Ramanaidu: ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టిన పడవల వెనుక కుట్ర కోణం..!

Nimmala Ramanaidu

Nimmala Ramanaidu

Minister Nimmala Ramanaidu: ప్రకాశం బ్యారేజీని పడవలు ఢీకొట్టిన ఘటన వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానాలు వ్యక్తం చేశారు మంత్రి నిమ్మల రామానాయుడు.. ఈ రోజు విజయవాడలోని ప్రకాశం బ్యారేజీ గేట్లను పరిశీలించిన మంత్రి నిమ్మల.. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటికే చేరుకున్న కౌంటర్ వెయిట్ల అమరిక గురించి అధికారును అడిగి తెలుసుకున్నారు.. ఎటువంటి ఇబ్బంది లేకుండా సజావుగా కౌంటర్ వెయిట్ ల అమరిక పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఇక, 67, 69 కానాల కౌంటర్ వెయిట్‌లు దెబ్బ తిన్నాయి.. 70 కానా కౌంటర్ వెయిట్ చిన్న పాటి డ్యామేజ్‌ అయ్యిందని వెల్లడించారు.. 67, 69 కానాల కౌంటర్ వెయిట్ ల అమరిక రెండు రోజుల్లో పూర్తవుతుందన్నారు..

Read Also: RG Kar Hospital: కోల్‌కతా ఆర్‌జి కర్ ఆసుపత్రిపై మరో ఆరోపణ..వైద్యుల నిర్లక్ష్యంతో యువకుడు బలి?

మరోవైపు.. కన్నయ్య నాయుడును ఇరిగేషన్ సలహాదారుగా నియమించాం.. కన్నయ్య నాయుడు పర్యవేక్షణలో కౌంటర్ వెయిట్ల అమరిక జరుగుతోందన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు.. అయితే, ప్రకాశం బ్యారేజీని గుద్దుకున్న పడవల వెనుక కుట్ర కోణం ఉందనే అనుమానం ఉందన్నారు.. భవిష్యత్తులో పడవలు వచ్చి గుడ్డుకోకుండా చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు మంత్రి నిమ్మల రామానాయుడు.. కాగా, విజయవాడ నగరాన్ని ముంచెత్తిన బుడమేరు గండ్లను పూడ్చే పనిలో నిమగ్నమైన మంత్రి నిమ్మల.. పూర్తిస్థాయిలో ఆ గండ్లను పూడ్చిన తర్వాతే అక్కడి నుంచి కదలిన విషయం విదితమే..

Show comments