Heavy Rains: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో భారీ వర్షం కురుస్తుంది. విజయవాడ సహా పలు జిల్లాలోని అనేక ప్రాంతాల్లో అకాల వర్షం పడుతుంది. గన్నవరం, నందిగామ, తిరువూరు, చందర్లపాడు మండలంలోని ఏటూరు గ్రామంలో వినాయకుని దేవాలయంలో ఈదురు గాలులకు ధ్వజస్తంభం నేలకొరిగింది. అలాగే, ఏ. కొండూరు మండలం గోపాలపురం- కంభంపాడు మధ్య జాతీయ రహదారిపై గాలివాన బీభత్సానికి భారీ చెట్లు నేలకొరిగాయి.
Read Also: PM Modi: ‘‘ఇకపై మన నీరు మన కోసమే ప్రవహిస్తుంది, మన కోసమే ఆగిపోతుంది’’.. పాక్కి మోడీ బిగ్ మెసేజ్..
ఇక, చెట్లను హైవే పెట్రోలింగ్ పోలీసులు స్థానిక ప్రజలతో కలిసి రంప కోత యంత్రాల సహాయంతో తొలగిస్తున్నారు. అనంతరం ట్రాఫిక్ పునరుద్ధరణ కొరకు తగిన చర్యలు చేపట్టారు. కాగా, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. అలాగే, రేపు ఉత్తరాంధ్రలోని పలు ప్రాంతాల్లో వర్షాలు పడే అవకాశం ఉంది. అల్లూరి, అన్నమయ్య జిల్లాల్లో రైల్వేకోడూరులోనూ ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం పడింది. ఒకవైపు ఎండ, మరోవైపు వాన పడడం ఆశ్చర్యం కలిగించింది.