CM Chandrababu: స్త్రీ శక్తి పథకం యొక్క మొదటి లబ్ధిదారులుగా ఉమ, కృష్ణవేణి లను గౌరవించామని సీఎం చంద్రబాబు తెలిపారు. రూ. 2.02 కోట్ల మహిళలకు ఆర్థిక స్వాతంత్య్రం కల్పించడం కోసమే ఈ పథకం తెచ్చాం.. ఆడ బిడ్డలకు మహర్దశ వచ్చే వరకూ అండగా ఉంటాం.. స్వర్ణాంధ్ర 2047 ఆనందం, ఆరోగ్యం, ఆదాయం ఉండాలని తీసుకొచ్చాం.. ఆడబిడ్డలకు మంచి చేయడం నా పూర్వజన్మ సుకృతం.. ఆగష్టు 15న స్త్రీ శక్తి ప్రారంభించడానికి కారణం మహిళల స్వాతంత్ర్యం.. రాష్ట్రంలో ఏ ప్రాంతానికి వెళ్ళాలన్నా స్వేచ్ఛగా వెళ్ళే అధికారం మహిళలకు ఇచ్చాం.. సూపర్ సిక్స్ సూపర్ హిట్.. అని గర్వంగా చెపుతున్నా.. నేను, పవన్, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాం.. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలడానికి లేదని చెప్పారు పవన్ కళ్యాణ్.. గత ఐదేళ్ళలో ప్రజలు చాలా ఇబ్బంది పడ్డారని ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడించారు.
Read Also: Cloud Particle Scam: క్లౌడ్ పార్టికల్ స్కామ్.. ఈడీ రైడ్స్‌లో కోట్లల్లో ఆస్తులు సీజ్..
ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తా..
ఇక, రాష్ట్రంలో ఎవరైనా ఆడబిడ్డల జోలికి వస్తే తాట తీస్తామని సీఎం చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. ఆడబిడ్డలను అవమానించిన అంశంలో నేను, పవన్ బాధితులమే.. క్యారెక్టర్ అసాసినేషన్ ఎవరు చేసినా వదిలిపెట్టాం.. ఎవరైనా తోక తిప్పితే తోక కట్ అయిపోతుంది.. ఆడబిడ్డల కోసం ప్రత్యేక చట్టం తేవడానికి వెనుకాడం అన్నారు. ఆడబిడ్డలపై గతంలో తలిదండ్రులు కూడా వివక్ష చూపించేవారు.. భర్తకు పర్మిషన్ అక్కర్లేదు.. భార్యకు పర్మిషన్ కావాలి.. ఇదేక్కడి న్యాయం అని పేర్కొన్నారు. కడుపున పుట్టిన పిల్లలూ ఆడవారికి ఏమీ తెలీదనే వారు.. అవి చూసి పుట్టిన ఆలోచనే డ్వాక్రా సంఘాలని చంద్రబాబు చెప్పుకొచ్చారు.
64 లక్షల మందికి పెన్షన్స్..
అయితే, ఏపీలో 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చామని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దీపం పథకం మొట్టమొదటిసారిగా ప్రారంభించింది టీడీపీ.. ఇవాళ దీపం 2 పథకం ఇచ్చాం.. మెగా డీఎస్సీ 16,347 ఉద్యోగాలు ఈ నెలాఖరుకు ఇస్తున్నాం.. ఐదేళ్ళలో 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని మరోసారి హామీ ఇస్తున్నా.. ఐదు రకాల బస్సులలో ఎటు వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.. ప్రతీ మహిళ ఉద్యోగానికి, విధులకు వెళ్ళడానికి ఉచితంగా వెళ్ళచ్చు.. శ్రీకాకుళం నుంచి మంత్రాలయం వరకూ ఉచితంగా వెళ్ళచ్చు.. చిరు వ్యాపారులకు రోజుకు వంద రూపాయలు మిగులుతాయి.. నరేగా పనులు, కూలి పనులకు వెళ్ళే మహిళలకు ఉచిత ప్రయాణం అందుతుంది.. వెనక్కి తిరిగి చూడకుండా ముందుకు ఈ ఎన్డీయే ప్రభుత్వం వెళుతుందని నారా చంద్రబాబు తెలిపారు.
మహిళలకు జీరో టికెట్..
రాష్ట్రంలోని జీరో ఫేర్ టికెట్ ను మహిళలు అందరికి ఇస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. ఆసుపత్రికి వెళ్ళే వారి దగ్గర నుంచి మార్కెట్ కు వెళ్ళే వారికి కూడా ఉపయోగపడుతుంది.. బస్సులు అన్నీ కండిషన్ లో ఉంచాం.. ఎక్కడా ఏ బస్సు నిలిచిపోకూడదు.. బస్సులకు రిపేర్లు వస్తే పర్యవేక్షించడానికి ఎక్కడికక్కడ ఏర్పాటు చేశాం.. రియల్ టైం బస్ ట్రాకింగ్ విధానం తీసుకొచ్చాం.. ఆడబిడ్డలకు ఇబ్బందులు లేకుండా నడిపే బాధ్యత ఏపీఎస్ఆర్టీసీ ది.. ఏపీఎస్ఆర్టీసీ లో కూడా డబ్బులు సంపాదించే మార్గాలు చేస్తున్నాం.. ఆర్టీసీ భవనాలను కమర్షియల్ చేస్తాం.. పార్సిల్ సర్వీసును మరింత అభివృద్ధి చేస్తాం.. ఇకపై ఎలక్ట్రికల్ ఏసీ బస్సులే కొంటాం.. డ్వాక్రాలో మెప్మాలో MSME లకు ప్రాధాన్యత ఇస్తున్నాం.. మహిళలను పారిశ్రామిక వేత్తలను తయారు చేస్తామని ఏపీ సీఎం వెల్లడించారు.
బస్సు డ్రైవర్లుగా మహిళలు..
ప్రస్తుతం రాష్ట్రంలో కండక్టర్లుగా మాత్రమే ఆడవారు వచ్చారు అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. త్వరలో ఆడబిడ్డలు కూడా డ్రైవర్లు అవుతారు.. త్వరలో ఎలక్ట్రికల్ బస్సులలో ఆటోమేటిగ్గా డ్రైవ్ చేసే అవకాశం వస్తుంది.. ఎలక్ట్రికల్ బస్సులలో ఆడవారు డ్రైవర్లుగా వస్తారని తెలిపారు. ఆడవారు రాజకీయాలలోకి రావాలని ఎన్టీఆర్ 9 శాతం రిజర్వేషన్ పెడితే, మోడీ ఇవాళ ఆ రిజర్వేషన్ 33 శాతం చేశారు.. అలాగే, అమరావతి పనులు జరుగుతున్నాయి.. పోలవరం పూర్తయితే త్రాగునీటి సమస్య లేకుండా పోతుందన్నారు. ఇక, విశాఖ స్టీలుకు రూ. 12 వేల కోట్లు ఇచ్చారు మోడీ.. ఏపీకి సెమీ కండక్టర్ ఇండస్ట్రీ కేంద్రం ఇచ్చింది.. కేంద్రం పూర్తి సహకారం అందించిందని చంద్రబాబు తెలిపారు.
పులివెందుల ఎన్నిక ఆసక్తికర వ్యాఖ్యలు..
కడప జిల్లాలోని పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికల్లో 30 సంవత్సరాల తరువాత ఓటు వేసే అవకాశం ఇచ్చారని బ్యాలెట్ లో స్లిప్ రాసి వేశారని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. 79వ స్వాతంత్ర్య దినోత్సవంకు ముందు రోజు పులివెందులలో స్వతంత్రం వచ్చింది.. కరుడుగట్టిన నేరస్తులు రాజకీయ ముసుగులో వచ్చి రాజకీయాన్ని నాశనం చేయాలని చూస్తున్నారని మండిపడ్డారు. 2014 సీఎం కాదు.. 95 సీఎం అని చెప్పా.. రాజకీయ ముసుగులో ఎవరైనా నాశనం చేయాలని చూస్తే వదిలేది లేదు.. రాబోయే రోజుల్లో రిగ్గింగులు ఉండవని తేల్చి చెప్పారు. కాగా, వాట్సప్ ద్వారా 700 సేవలు ఆటోమేటిక్ గా అందుబాటులోకి వచ్చాయి.. పట్టాదారు పాసుబుక్కుపై గతంలో బొమ్మ వేరే వారిది.. ప్రభుత్వ అధికార ముద్రతో మాత్రమే పాస్ పుస్తకాలు ఇస్తున్నది ఎన్డీఏ ప్రభుత్వం అని చంద్రబాబు తెలియజేశారు.
