Vallabhaneni Vamsi: గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీ కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. వంశీని మరోసారి విచారణ చేసేందుకు కస్టడీ కోరుతూ పోలీసులు పిటిషన్ దాఖలు చేశారు. కస్టడీ పిటిషన్ పై ఎస్సీ, ఎస్టీ కోర్టు విచారణ జరిపింది. ఈ సందర్భంగా కస్టడీ పిటిషన్ డిస్మిస్ చేసింది విజయవాడ ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు. ఇక, విచారణను ఈ నెల 12వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు న్యాయస్థానం తెలిపింది.
Read Also: Satya Kumar Yadav: స్వర్ణాంధ్రప్రదేశ్ ను తీర్చిదిద్దేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంటుంది..
కాగా, ఈ కేసు విచారణలో భాగంగా కౌంటర్ దాఖలు చేసేందుకు సత్యవర్థన్ తరపు లాయర్ రెండు రోజులు సమయం కోరగా.. దాంతో బెయిల్ పిటిషన్ పై విచారణను 12వ తేదీకి వాయిదా వేసింది విజయవాడలోని ఎస్సీ, ఎస్టీ స్పెషల్ కోర్టు. అదే సమయంలో వల్లభనేని వంశీ ఉంటున్న బ్యారక్ మార్చాలని దాఖలు చేసిన పిటిషన్ పై కూడా విచారణ చేసింది న్యాయస్థానం. కానీ, ఇతర ఖైదీలు ఉంటున్న బ్యారక్ లోకి వంశీని మార్చడం కుదరదని జైలు అధికారులు కోర్టుకు వెల్లడించారు. భద్రతా కారణాలతో బ్యారక్ మార్చలేమన్నారు. ఇక, మెత్తటి దిండు, దుప్పటి కావాలని వంశీ కోరగా, అందుకు జైలు అధికారులు ఒప్పుకున్నారు.