Site icon NTV Telugu

DK Aruna: కేటీఆర్‌కి దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి.. డీకే అరుణ సవాల్‌

Dk Aruna

Dk Aruna

DK Aruna: హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) సమీపంలోని కంచ గచ్చిబౌలి భూముల వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో కాకరేపుతోంది.. మాజీ మంత్రి కేటీఆర్‌ ఈ వ్యవహారంలో కాంగ్రెస్‌, బీజేపీపై ఆరోపణలు గుప్పించారు.. సీఎం రేవంత్ రెడ్డిని టార్గెట్‌ చేస్తూనే.. ఓ బీజేపీ ఎంపీకి కూడా లింక్‌ ఉందని కామెంట్‌ చేశారు.. ఈ నేపథ్యంలో కేటీఆర్‌పై ఫైర్‌ అయ్యారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆమె.. కేటీఆర్ కి దమ్ముంటే ఆ ఎంపీ పేరు చెప్పాలి కదా? అని సవాల్‌ చేశారు.. ఎవరి గురించి మాట్లాడాడో చెప్పకుండా… ఒక ఎంపీ అని గాలివార్త చెప్తే సరిపోదు కదా..? అని నిలదీశారు..

Read Also: Tollywood : అలనాటి క్లాసిక్ టైటిల్స్ తో వచ్చిన ఇప్పటి తెలుగు సినిమాలు..

ఇక, సౌత్ పైన భారతీయ జనతా పార్టీ ఫోకస్ పెట్టింది.. తెలంగాణలో మొన్న ఎన్నికల్లో విజయవంతంగా ఎనిమిది మంది ఎంపీలు గెలిచాం… ఆంధ్రాలో కూడా బీజేపీ ఎంపీలు గెలిచారన్న డీకే అరుణ.. ఆంధ్రలో ఎన్డీఏ ప్రభుత్వం ఉంది… తెలంగాణలో బీజేపీ స్వతంత్రంగా అధికారంలోకి రాబోతుందన్నారు.. ఏపీలో కూడా మళ్లీ ఎన్డీఏ అధికారంలోకి వస్తుందనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు.. మరోవైపు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్ కేటీఆర్‌.. ఇద్దరూ ఒక్కటే కాబట్టి… తమిళనాడులో జరిగిన స్టాలిన్ సమావేశానికి వెళ్లారని విమర్శించారు.. తమిళనాడులో తండ్రీ కొడుకులే ఉండాలనుకుంటున్నారు కాబట్టి.. ఏదేదో కామెంట్ చేస్తున్నారు అంటూ మండిపడ్డారు బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ..

Exit mobile version