NTV Telugu Site icon

CM Chandrababu: మంత్రులకు సీఎం సీరియస్‌ వార్నింగ్‌.. పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదు..!

Babu

Babu

CM Chandrababu: మంత్రులకు సీరియస్‌ వార్నింగ్‌ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు సరిగా పనిచేయకపోతే.. వారిని తీసివేస్తానంటూ హెచ్చరించారు.. తనకు పనిచేయని మంత్రులు అక్కరలేదంటూ తేల్చిచెప్పారు.. మంత్రులు సరిగ్గా పని చేయకపోతే వారినీ తీసేస్తా… పని చేయని వాళ్లు నాకు అక్కర్లేదని స్పష్టం చేశారు.. జక్కంపూడిలో వరద సహాయ చర్యల్లో సరిగ్గా పని చేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామని గుర్తుచేశారు సీఎం చంద్రబాబు..

Read Also: Siddaramaiah: నేనేం తప్పు చేయనప్పుడు ఎందుకు భయపడాలి..?

ఇక, గత ఐదేళ్ల కాలంలో అధికార వ్యవస్థకు పెరాలసిస్‌ వచ్చిందంటూ దుయ్యబట్టారు సీఎం చంద్రబాబు.. నాకు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితి తీసుకొచ్చారన్న ఆయన.. వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల్లో సరిగా పనిచేయకపోతే చర్యలు తప్పవని హెచ్చరించారు.. జక్కంపూడిలో వరద సహాయ చర్యల్లో సరిగ్గా పని చేయని ఓ అధికారిని సస్పెండ్ చేశామం.. ఇకపై ఎవ్వరినీ ఊపేక్షించేది లేదు అన్నారు.. అంతేకాదు.. మంత్రులు కూడా సరిగా పనిచేయకపోతే వారిపైనా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.. కాగా, వరద ప్రభావానికి గురైనటువంటి ప్రాంతాలలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు విస్తృతంగా ప్రకటించారు. జక్కంపూడి, సింగ్ నగర్, సితార సెంటర్ ప్రాంతాలలోకి ఆయన జేసీబీపై వెళ్లి అక్కడ పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. దాదాపు 5 అడుగుల లోతు మేర నీళ్లు ఉండడంతో వాహనాలను అక్కడికి పంపడానికి ఇబ్బంది ఏర్పడడంతో.. జేసీబీ వాహనంపై కూర్చుని లోతట్టు ప్రాంతాలలోని ప్రజల కష్టసుఖాలను ఆయన అడిగి తెలుసుకున్నారు. ఇంకా జలదిగ్బంధంలోనే ఉన్న సింగ్ నగర్, జక్కంపూడి ప్రాంతాలలోని ప్రజలను సురక్షిత ప్రాంతాలకు రావాలని కోరారు. తాగునీరు ఆహారం సకాలంలో బాధితులకు అందరికీ అందించాలని అధికారులను ఆదేశించారు… ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ మంత్రి వీరాంజనేయులు ముఖ్యమంత్రి వెంట ఉండి పరిస్థితులను క్షుణ్ణంగా వివరించారు. ఎమ్మెల్యే కృష్ణ ప్రసాద్ ను దగ్గరుండి వరద బాధితులకు సహాయక చర్యలు అందేలా చూడాలని ఆయన ఆదేశించారు సీఎం చంద్రబాబు నాయుడు.

Show comments