AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP Panchayat Elections: ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ వేగం పుంజుకుంది. మొదటి దశ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల పరిశీలన పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా 42 రెవెన్యూ డివిజన్లు, 201 మండలాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 3,949 సర్పంచ్ స్థానాలు, 39,832 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తున్నారు. పరిశీలన అనంతరం 21,393 సర్పంచ్ అభ్యర్థుల నామినేషన్లు, 87,318 వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్లు చెల్లుబాటైనట్లు అధికారులు వెల్లడించారు. ఇక, మొదటి దశలో తిరుపతి జిల్లా అత్యధిక స్థానాలతో ముందంజలో ఉంది. జిల్లాలోని 16 మండలాల్లో 404 సర్పంచ్ స్థానాలకు, 3,684 వార్డు సభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడ అత్యధికంగా 2,267 మంది సర్పంచ్ అభ్యర్థులు పోటీలో నిలిచారు. ఇక అత్యధిక వార్డు సభ్యుల అభ్యర్థుల నామినేషన్లు అనకాపల్లి జిల్లాలో చెల్లుబాటయ్యాయి. ఈ జిల్లాలో 6,515 వార్డు సభ్యుల నామినేషన్లు ఆమోదం పొందాయి.
మరోవైపు గ్రామ పంచాయతీ ఎన్నికల రెండో దశ నామినేషన్ల దాఖలు ప్రారంభమైంది. రెండో దశలో రాష్ట్రంలోని 27 జిల్లాల పరిధిలో 52 రెవెన్యూ డివిజన్లు, 246 మండలాల్లోని మొత్తం 4,975 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించనున్నారు. రెండో దశ నామినేషన్ల స్వీకరణ మొదటి రోజున సర్పంచ్ స్థానాలకు రాష్ట్రవ్యాప్తంగా 3,504 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు 7,329 నామినేషన్లు వచ్చాయి. రెండో దశలో విశాఖపట్నం జిల్లాలోని ఏ గ్రామ పంచాయతీకి ఎన్నికలు నిర్వహించడం లేదు. సర్పంచ్ స్థానాలకు అత్యధికంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో 366 నామినేషన్లు దాఖలయ్యాయి. వార్డు సభ్యుల స్థానాలకు సంబంధించి శ్రీకాకుళం జిల్లాలో అత్యధికంగా 845 నామినేషన్లు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రక్రియ రెండు దశల్లోనూ ఉత్సాహంగా కొనసాగుతోంది.
Also Read
- Perni Nani: ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం.. వెనక్కి తగ్గే వరకు పోరాటం..!
- SEC Anil Chandra Punetha: నామినేషన్ల ప్రక్రియపై ఎస్ఈసీ సీరియస్.. కలెక్టర్లు, ఎస్పీలకు కీలక ఆదేశాలు.. అవసరమైతే ఎఫ్ఐఆర్లు..!
- AP Panchayat Elections: తొలి దశ పంచాయతీ ఎన్నికలు.. నేటితో నామినేషన్లకు తెర
- AP Panchayat Elections Phase 2: రెండో దశ పంచాయతీ ఎన్నికలకు నోటిఫికేషన్.. నామినేషన్ల నుంచి ఫలితాల వరకు పూర్తి వివరాలివే!
తాజావార్తలు
-
AP Panchayat Elections: తొలి దశలో బరిలో 21 వేల మందికి పైగా సర్పంచ్ అభ్యర్థులు.. 87 వేల వార్డు అభ్యర్థులు
-
ACB Raid in Hyderabad: ఖాకీ ముసుగులో కక్కుర్తి.. రక్షకులే భక్షకులైతే సమాజానికి దిక్కెవరు?
-
Montra Electric Auto: రూ.3.97 లక్షలకే మోంట్రా కొత్త ఎలక్ట్రిక్ ఆటో.. ఒక్క ఛార్జింగ్‌తో 180 కి.మీ.కు పైగా రేంజ్!
-
Akvan Cyclone Alert: అక్వాన్ తుఫాన్ ఎఫెక్ట్.. ఉత్తరాంధ్రకు అలర్ట్
-
Xi Jinping Welcomes Trump: ట్రంప్‌కు జిన్‌పింగ్ గ్రాండ్ వెల్కమ్.. ప్రోటోకాల్ పక్కనపెట్టి ఆలింగనం! వైరల్‌గా వీడియో
ట్రెండింగ్
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్‌లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!
-
370 కి.మీ. రేంజ్, 10 అంగుళాల టచ్‌స్క్రీన్‌తో భారత్‌లోకి రానున్న VinFast VF5 ఫేస్‌లిఫ్ట్..!
-
India Wholesale Inflation: సామాన్యుడి నడ్డి విరుస్తున్న నిత్యావసరాల ధరలు.. నాలుగేళ్ల గరిష్టానికి టోకు ద్రవ్యోల్బణం!
-
38 గంటల బ్యాటరీ బ్యాకప్, IP57 రేటింగ్, 11mm డ్రైవర్లతో Xiaomi Clip Earbuds లాంచ్..!
-
21 రోజుల బ్యాటరీ లైఫ్, 150కి పైగా స్పోర్ట్స్ మోడ్ Xiaomi Watch S5 41mm వచ్చేసింది..! Smart Band 11 కూడానూ..