AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
AP MPTC ZPTC Elections: కొన్ని ప్రాంతాలు హింసాత్మక ఘటనలు మినిహాయిస్తే ఆంధ్రప్రదేశ్‌లో నవంబర్ 5న అంటే గురువారం రోజు నిర్వహించిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఈ ఎన్నికలకు సంబంధించిన తుది పోలింగ్ శాతాన్ని రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. రాష్ట్రవ్యాప్తంగా సగటున 70.72 శాతం పోలింగ్ నమోదైనట్లు ప్రకటించింది. గ్రామీణ ప్రాంతాల్లో ఓటర్లు పెద్ద సంఖ్యలో పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో విశాఖపట్నం జిల్లా అత్యధిక పోలింగ్‌తో రాష్ట్రంలోనే మొదటి స్థానంలో నిలిచింది. ఇక్కడ 82.51 శాతం ఓటింగ్ నమోదైంది. మరోవైపు అల్లూరి సీతారామరాజు జిల్లాలో అత్యల్పంగా 62.01 శాతం పోలింగ్ నమోదైంది. ఈ రెండు జిల్లాల మధ్య పోలింగ్ శాతంలో గణనీయమైన వ్యత్యాసం కనిపించింది.
జిల్లాల వారీగా పోలింగ్ వివరాలను పరిశీలిస్తే.. శ్రీకాకుళంలో 65.51 శాతం, పార్వతీపురం మన్యంలో 67.13 శాతం, విజయనగరంలో 76.21 శాతం, విశాఖపట్నంలో 82.51 శాతం, అనకాపల్లిలో 75.58 శాతం, అల్లూరి సీతారామరాజు జిల్లాలో 62.01 శాతం, పోలవరంలో 65.48 శాతం పోలింగ్ నమోదైంది. అదేవిధంగా కాకినాడలో 68.94 శాతం, డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ కోనసీమలో 66.33 శాతం, తూర్పు గోదావరిలో 71.56 శాతం, పశ్చిమ గోదావరిలో 69.73 శాతం, ఏలూరులో 75.52 శాతం, కృష్ణా జిల్లాలో 73.21 శాతం, ఎన్టీఆర్ జిల్లాలో 75.53 శాతం ఓటింగ్ నమోదైంది.
Also Read
- AP MPTC, ZPTC Elections: ఈ మండలాల్లో రేపు ఎంపీటీసీ, జెడ్పీటీసీ పోలింగ్.. అక్కడ రీపోలింగ్‌కు ఎస్ఈసీ ఆదేశాలు!
- Vangaveeti Radha : నగర ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటా.. మేయర్‌గా బాధ్యత మరింత పెరిగింది
- AP Municipal Election Results: ఉమ్మడి కృష్ణా జిల్లాలో కూటమి హవా..
- 53 Trains Cancelled: అర్నబ్ తుఫాన్ ఎఫెక్ట్.. రెండు రోజులు 53 రైళ్లు రద్దు.. పూర్తి జాబితా ఇదే..
ఇక, గుంటూరులో 73.12 శాతం, పల్నాడులో 70.93 శాతం, బాపట్లలో 67.47 శాతం, ప్రకాశంలో 68.53 శాతం, మార్కాపురంలో 67.69 శాతం, ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లాలో 70.62 శాతం పోలింగ్ నమోదైంది. తిరుపతిలో 68.67 శాతం, చిత్తూరులో 76.30 శాతం, అన్నమయ్య జిల్లాలో 69.19 శాతం, వైఎస్సార్ కడప జిల్లాలో 71.78 శాతం ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. మరోవైపు.. రాయలసీమలోని ఇతర జిల్లాల విషయానికొస్తే.. అనంతపురంలో 64.38 శాతం, శ్రీ సత్యసాయి జిల్లాలో 73.71 శాతం, కర్నూలులో 68.29 శాతం, నంద్యాలలో 74.27 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తంగా చూస్తే.. విశాఖపట్నం, విజయనగరం, చిత్తూరు, అనకాపల్లి, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాల్లో 75 శాతానికి పైగా పోలింగ్ నమోదైంది. అల్లూరి సీతారామరాజు, అనంతపురం, పోలవరం జిల్లాల్లో పోలింగ్ శాతం తక్కువగా ఉంది. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాలను కలిపి సగటున 70.72 శాతం పోలింగ్ నమోదైనట్లు ఎన్నికల సంఘం ప్రకటించింది..
తాజావార్తలు
-
Vemulawada: వేములవాడలో హృదయవిదారక ఘటన.. బతికుండగానే వైకుంఠధామంకు..!
-
AP MPTC ZPTC Elections: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల పోలింగ్ శాతంపై ఈసీ కీలక ప్రకటన.. విశాఖ ఫస్ట్.. అల్లూరి లాస్ట్..!
-
Delhi-NCR Air Pollution: ఢిల్లీలో గాలి పీల్చడం 30 సిగరెట్లు తాగినట్లేనా..? సుప్రీంకోర్టు సంచలన వ్యాఖ్యలు!
-
Sharvari Wagh: ‘ముంజ్యా’ తర్వాత ఒక్క హిట్ లేదు.. శార్వరి ఆశలన్నీ ఆ సినిమాపైనే!
-
IPL 2027: సన్‌రైజర్స్‌తో సీఎస్కే భారీ ట్రేడ్ డీల్.. లివింగ్‌స్టోన్‌తో పాటు మరో ఆల్‌రౌండర్ జట్టులోకి..?
ట్రెండింగ్
-
Andre Russell: 10 వేల పరుగులు, 500 వికెట్లతో టీ20 క్రికెట్లో ఆండ్రీ రస్సెల్ వరల్డ్ రికార్డు..!
-
IPL 2027-DC: గంగూలీ టార్గెట్ ఆ ఇద్దరు విదేశీ స్టార్లే.. ఢిల్లీ క్యాపిటల్స్ వేలం ప్లాన్ లీక్!
-
37 గంటల బ్యాటరీ బ్యాకప్, అడ్వాన్స్డ్ ANC ఫీచర్లు, Bose సౌండ్ టెక్నాలజీతో Moto Buds 2 Ultra లాంచ్..!
-
100+ స్పోర్ట్స్ మోడ్లు, 12 రోజుల బ్యాటరీ లైఫ్, డ్యూయల్ GPS, gOLED డిస్ప్లేతో Moto Watch 2 Fit లాంచ్..!
-
200MP పెరిస్కోప్ కెమెరా, ఏడేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 7000mAh బ్యాటరీతో Motorola Signature 27 లాంచ్..!