NTV Telugu Site icon

Home Minister Anitha: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుతున్నాయి.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిందే..!

Home Minister Anitha

Home Minister Anitha

Home Minister Anitha: టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుతున్నాయి.. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉందన్నారు ఆంధ్రప్రదేశ్‌ హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.. సైబర్ నేరాలపై అవగాహన కల్పించేందుకు విజయవాడలో సైబర్ క్రైమ్ అవగాహన ర్యాలీ నిర్వహించారు.. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియం నుంచి బెంజ్ సర్కిల్ వరకూ వాక్ థాన్ జరిగింది.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న హోం మంత్రి అనిత.. సైబర్ సోల్జర్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పోలీస్ కమిషనర్ ఎస్వీ రాజశేఖర్ బాబుకి అభినందనలు తెలిపారు..

Read Also: Kishan Reddy: జమ్మూకాశ్మీర్ లో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుంది..

ఇక, టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ నేరాలు పెరుతున్నాయి .. ఈ సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది అన్నారు అనిత.. విద్యావంతులే ఎక్కువగా సైబర్ నేరాల బారిన పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.. నాలుగు నెలల వ్యవధిలో దేశవ్యాప్తంగా 1700 వెయ్యి కోట్లు సైబర్ నేరగాళ్లు కాజేశారు.. ఇన్ స్టంట్ లోన్ మోసాలు ఎక్కువగా పెరిగిపోతున్నాయి.. నాకు కూడా ఈ మధ్య 50 లక్షలు లోన్ ఇస్తామని మెసేజ్ పెట్టారని పేర్కొన్నారు. సైబర్ పోలీస్ స్టేషన్ లు జిల్లాకు ఒకటి ఉన్నాయి.. ప్రతీ జిల్లాలో సైబర్ సెల్ ఏర్పాటు చేయాలి.. ఎవరూ మనల్ని చెడగొట్టనవసరం లేదు.. మన మొబైల్, మొబైల్ లో యాప్ చాలు మనం చెడిపోవడానికి అని హెచ్చరించారు. సైబర్ నేరాల పై ఫిర్యాదులు చేసేందుకు అందరూ ముందుకు రావాలి అని పిలుపునిచ్చారు. ఇక, పోలీస్ డిపార్ట్ మెంట్ తరపున మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత.