Site icon NTV Telugu

CM Chandrababu: ఆహార పంపిణీ సక్రమంగా సాగుతోంది.. డిమాండ్ చేసి వస్తువులు తీసుకోండి..

Babu

Babu

CM Chandrababu: ఇవాళ ఆహార పంపిణీ సక్రమంగా జరిగింది.. ఫుడ్ కొద్దిగా వృధా అయినా ఫర్వాలేదని చెప్పి ఉదారంగా పంపిస్తున్నాం అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.. విజయవాడలో మీడియాతో మాట్లాడిన ఆయన.. మంచినీళ్లు.. పాలు, బిస్కెట్లు.. కొవ్వొత్తులు.. అగ్గిపెట్టెలు కూడా పంపిస్తున్నాం. బియ్యం.. ఉల్లిపాయలు, చక్కెర, ఆయిల్ కూడా అందిస్తున్నాం.. ఎక్కడైనా బియ్యం, ఇతర వస్తువులు దొరకకుండా చేస్తే చొక్కా పట్టుకుని అడగండి అని సూచించారు. డ్రై ఫుడ్‌ కూడా పంపిస్తున్నాం. డిమాండ్ చేసి వస్తువులు తీసుకోండి అంటూ వరద బాధితులకు సూచించారు..

Read Also: Weight Loss Tips: త్వరగా బరువు తగ్గాలా? అయితే ఈ టిప్స్ పాటించండి

ఇక, బుడమేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం అన్నారు సీఎం చంద్రబాబు.. కేంద్రానికి వరదలపై ప్రాథమిక నివేదిక పంపించాం.. రూ. 6880 కోట్ల నష్టం వచ్చింది.. ఇదే నివేదిక ఇచ్చాం అన్నారు.. బుడమేరు గండ్లు మూడూ పూడ్చివేశాం. గండ్లు పూడ్చిన తర్వాత నమ్మకం వచ్చింది. వినాయకచవితి పండగ రోజు గండ్లు పూడ్చాం. ఆర్మీ కూడా ప్రశంసించిందన్నారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, లోకేష్ దృష్టి పెట్టి బుడమేరు గండ్లు పూడ్చారని అభినందించారు. గత పాలకులు విధ్వంసం సృష్టించారని మండిపడ్డారు.. గత ప్రభుత్వంలో అన్నమయ్య ప్రాజెక్ట్ కొట్టుకుపోయింది. గేట్ల నిర్వహణకు పైసా ఇవ్వలేదు.. బుడమేరుకు నిధులివ్వలేదు. అన్ని పాపాలు కలిసి ఇప్పుడు శాపాలుగా మారాయన్నారు. వర్షం ఎక్కువగా పడుతోంది.. కృష్ణాలో మళ్లీ నీళ్లు వస్తున్నాయి. బుడమేరు క్లోజ్ చేసినా ఇంకా ఒక టీఎంసీ నీళ్లు విజయవాడలో ఉన్నాయి.. వర్షం వల్ల మళ్లీ నీళ్లు పెరుగుతున్నాయి. అప్రమత్తంగా ఉండాలని సూచించారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు.

Exit mobile version