Andhra Cricket Association: ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.. ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని), కార్యదర్శిగా సానా సతీష్‌తో సహా 34 మందితో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. మూడేళ్ల కాలపరిమితితో ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయనుంది నూతన కమిటీ.. ఈ ఎన్నికలకు అధికారిగా వ్యవహరించారు నిమ్మగడ్డ రమేష్ కుమార్.. ఈ సందర్భంగా ఏసీఏ అధ్యక్షుడు, ఎంపీ కేశినేని చిన్ని మాట్లాడుతూ.. ఏసీఏ నూతన కార్యవర్గం ఎన్నికైంది.. మూడేళ్లల్లో రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధికి కృషి చేస్తాం అన్నారు.. మౌలిక సదుపాయాలు కల్పించి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులుగా తీర్చిదిద్దుతాం.. ఎక్కువ మంది క్రీడాకారులను తయారు చేస్తాం.. ఐపీఎల్ తరహాలో ఏపీఎల్ నిర్వహిస్తామని వెల్లడించారు.. అసోసియేషన్ ప్రతిష్ట పెంచేలా మేం పనిచేస్తామని తెలిపారు ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) అధ్యక్షుడు, విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని..
Read Also: Trump-Zelenskyy: సోమవారం అమెరికాకు జెలెన్‌స్కీ పయనం.. ట్రంప్‌తో కీలక భేటీ
మరోవైపు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్ మాట్లాడుతూ.. 2025-28 కాల పరిమితికి ఏసీఏ ఎన్నిక జరిగింది.. ఒక్క వైస్ ప్రెసిడెంట్ మినహా అందరూ ఏకగ్రీవంగా ఎన్నిక అయ్యారని వెల్లడించారు.. గత 11 నెలలుగా ఎఫెక్స్ కమిటీ సహకారంతో బాగా పని చేశారు.. విశాఖ స్టేడియం అభివృద్ధి, ఏపీఎల్ టోర్నీల నిర్వహణ సమర్థవంతంగా సాగింది.. ఇరవై లక్షల నుంచి నలభై లక్షలకు జిల్లా అసోసియేషన్లు పెంచాం.. కొంతమంది క్రీడాకారులను ఇంగ్లాండ్ పంపామని వెల్లడించారు.. రెడ్ బాల్, వైట్ బాల్ ఆట వల్ల క్రీడాకారులు కొంత గందరగోళంలో ఉన్నారు.. ఇది గుర్తించి వేర్వేరుగా క్రీడాకారులకు శిక్షణ ఇస్తున్నాం అన్నారు..
Read Also: Nagarjuna 100 Film: పుట్టినరోజున మైల్‌స్టోన్ మూవీ అనౌన్స్‌మెంట్.. నాగ్ లుక్ కూడా సిద్ధం?
ఇక, విష్ణు కుమార్ రాజు స్వయంగా ఎఫెక్స్ కమిటీ నుంచి తప్పుకున్నారు.. ఆయన కేవలం విశాఖలో అభివృద్ధి కోసం పని చేస్తా అన్నారని వివరించారు సానా సతీష్.. అయితే, చివరి నిమిషంలో వైస్ ప్రెసిడెంట్ గా నామినేషన్ వేయడంతో డిస్ క్వాలిఫై అయ్యింది.. సెప్టెంబర్‌లో జరిగే సమావేశంలో వైస్ ప్రెసిడెంట్ ఎన్నిక జరుగుతుందన్నారు.. వివాదాలు అన్నీ పరిష్కరించుకుని మేము ముందుకు వెళుతున్నాం.. వివాదరహిత అసోసియేషన్ గా మేం క్రికెట్ అభివృద్ధిపై దృష్టి పెట్టాం.. మూడేళ్లల్లో తప్పకుండా ఏసీఏ మంచి పని తీరుతో అన్ని సమస్యలు పరిష్కరిస్తాం.. క్రీడాకారులు కోసం ప్రత్యేకంగా అదనపు కోచ్ లను నియమిస్తాం.. MSK ప్రసాద్ ఏపీకి ఆడారు.. అంతర్జాతీయ క్రికెట్ లో రాణించారు.. ఆయన సేవలను ప్రభుత్వం గుర్తించి అకాడమీకి స్థలం కేటాయించి గౌరవించిందని వెల్లడించారు ఏసీఏ కార్యదర్శి సానా సతీష్.
