ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ఏసీఏ) నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నికైంది.. ఏసీఏ అధ్యక్షుడిగా కేశినేని శివనాథ్ (కేశినేని చిన్ని), కార్యదర్శిగా సానా సతీష్‌తో సహా 34 మందితో నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక కాగా.. మూడేళ్ల కాలపరిమితితో ఆంధ్రప్రదేశ్‌లో క్రికెట్ అభివృద్ధికి కృషి చేయనుంది నూతన కమిటీ..
కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో మెగా ఉచిత వైద్య శిబిరం జరుగుతోంది. విజయవాడ కేబీఎన్ కాలేజీలో ఉచిత మెగా మెడికల్ క్యాంప్‌ను ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. ‘పశ్చిమ నియోజకవర్గంలో వెరికోస్ వెయిన్స్ సమస్యతో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారు. ఈ క్యాంపులో వెరికోస్ వెయిన్స్ సమస్యపై నిపుణులైన వైద్యులు సేవలందిస్తున్నారు. ప్రజలందరూ ఉచిత మెగా మెడికల్ క్యాంపుని వినియోగించుకోవాలి’ అని ఎంపీ కేశినేని శివనాథ్ కోరారు. అన్ని ప్రాంతాల్లో…
ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని చిన్ని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఏసీఏ జనరల్ మీటింగ్‌లో అధ్యక్షుడిగా ఎంపీ కేశినేని శివనాథ్ ప్యానల్ ఎన్నికైనట్లు రిటర్నింగ్ అధికారి నిమ్మగడ్డ రమేష్ ప్రకటించారు.
విజయవాడలో క్రికెట్ అకాడమీ స్థాపనకు కృషి చేస్తాం అని ఎంపీ కేశినేని శివనాథ్ చెప్పారు. ఏపీ రాజధాని అమరావతితో పాటు విజయవాడ అభివృద్ధికి పాటుపడతాం అని తెలిపారు. నేడు విజయవాడలో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీ వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంకు ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ముఖ్య అథిదులుగా హజరయ్యారు. ఈ ఇద్దరిని వాకర్స్ అసోసియేషన్ సభ్యులు సన్మానించారు. ఆత్మీయ సమావేశం సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ……