ACB Court: ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ కోర్టులో ఊరట
- ఎంపీ మిథున్ రెడ్డికి ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట..
- పాస్ పోర్ట్ ఇచ్చేందుకు అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ACB Court: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఎంపీ మిథున్ రెడ్డికి విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానంలో ఊరట లభించింది.. పాస్ పోర్ట్ ఇచ్చేందుకు అనుమతి ఇస్తూ ఏసీబీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది.. ఆంధ్రప్రదేశ్‌లో సంచలనంగా మారిన ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఏ-4గా ఉన్న ఎంపీ మిథున్‌రెడ్డి అరెస్ట్ అయిన సమయంలో తన పాస్ పోర్ట్ ను కోర్టులో సమర్పించారు మిథున్ రెడ్డి.. అయితే, యూఎస్ వెళ్లేందుకు తన పాస్ పోర్ట్ ఇవ్వాలని ఏసీబీ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు మిథున్‌రెడ్డి.. ఇక, మిథున్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం.. పాస్‌పోర్ట్ ఇచ్చేందుకు అనుమతి ఇస్తూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.. అయితే, దేశం విడిచి వెళ్లే సమయంలో అనుమతి తీసుకోవాలని ఆదేశాల్లో పేర్కొంది విజయవాడలోని ఏసీబీ స్పెషల్ కోర్టు.. దీంతో, ఏసీబీ కోర్టులో ఎంపీ మిథున్‌రెడ్డికి ఊరట దక్కినట్టు అయ్యింది..
Read Also: Red Alert: రెడ్ అలర్ట్.. రానున్న 3 గంటల్లో ఈ జిల్లాల్లో పిడుగులతో కూడిన భారీ వర్షాలు..
Also Read
- Home Minister Anitha: ‘ఫ్యూచర్ రెడీ ఏపీ పోలీస్’ వర్క్‌షాప్.. పోలీసు వ్యవస్థపై హోంమంత్రి కీలక వ్యాఖ్యలు
- Sai Krishna Lockup Death Case: సాయి కృష్ణ కేసులో సంచలనం.. డీజీపీ, సీపీ పేర్లు చేర్చాలంటూ..!
- Narayana: త్రేతాయుగంలో రావణుడు విలన్.. కలియుగంలో రావణ్‌ను హీరో చేశారు..
- NIA Raids: విజయవాడలో ఎన్ఐఏ విస్తృత సోదాలు.. టెర్రర్ లింక్స్ కేసులో మూడు ప్రాంతాల్లో తనిఖీలు
కాగా, అయితే, న్యూయార్క్ లో జరగబోయే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలకు పీఎంవో నుంచి ఎంపికయ్యారు ఎంపీ మిథున్ రెడ్డి. ఈ నెల 27వ తేదీన నుంచి 31వ తేదీ వరకు న్యూయార్క్ లో యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ సమావేశాలు జరగనున్నాయి.. ఈ నేపథ్యంలో.. సిట్ సీజ్ చేసిన పాస్‌పోర్ట్ రిలీజ్ చేయాలంటూ ఏసీబీ కోర్టును మిథున్ రెడ్డి ఆశ్రయించిన విషయం విదితమే.. ఇక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంచలన సృష్టించిన లిక్కర్ స్కామ్ కేసులో ఏ-4గా ఉన్నారు ఎంపీ మిథున్‌రెడ్డి అయితే, సుమారు 71 రోజుల పాటు జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న మిథున్ రెడ్డికి సెప్టెంబర్ 29న ఏసీబీ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఆయన జైలు నుంచి విడుదలయ్యారు.. ఎంపీ మిథున్ రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ ను ఏసీబీ కోర్టు మంజూరు చేసింది. ఈ సందర్భంగా రూ. 2 లక్షలతో రెండు ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే, వారంలో రెండుసార్లు స్థానిక పోలీస్ స్టేషన్ లో సంతకాలు చేయాలని పేర్కొన్న విషయం విదితమే..
తాజావార్తలు
-
Ramayana Trailer: చివరి నిమిషంలో ‘రామాయణ’ ట్రైలర్ వాయిదా.. అసలు కారణం ఏంటంటే?
-
Sonam Wangchuk: విద్యార్థులపై కేసులుండవు, ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు పరిహారం.. కేంద్రం ఇచ్చిన హామీలు ఇవే!
-
Stock Market Crash: ఒకే ఒక్క నిర్ణయం.. కుప్పకూలిన భారత స్టాక్ మార్కెట్, భారీ నష్టాల్లో టాప్ 10 షేర్లు
-
Vaibhav Sooryavanshi: బుడ్డోడి బ్యాటింగ్ మిస్ అయ్యారా?.. వైభవ్ మెరుపు ఇన్నింగ్స్ ఫుల్ వీడియో మీకోసమే!
-
Love Couple Attacked: ప్రేమ వివాహం చేసుకున్న నవ దంపతులపై దాడి.. తాళిబొట్టు తెంచి..!
ట్రెండింగ్
-
ఒక్కసారి ఛార్జ్ చేస్తే 526 కి.మీ రేంజ్, Level-2 ADASతో Kia Syros EV లాంచ్.. రూ.13.49 లక్షల ప్రారంభ ధరతో.!
-
రూ.8,599కే 90Hz డిస్ప్లే, IR బ్లాస్టర్ ఫీచర్, మిలిటరీ-గ్రేడ్ డ్యూరబిలిటీతో ZENO 100 Pro లాంచ్.. పవర్ బ్యాంక్‌లు కూడా.!
-
Vaibhav Sooryavanshi Records: మూడు వరల్డ్ రికార్డులు బద్దలు కొట్టిన వైభవ్.. ఇక ఎవరికీ సాధ్యం కాదు!
-
Water Manifestation Technique: “నీటి మానిఫెస్టేషన్ టెక్నిక్” అంటే ఏమిటి.? నిజంగా పనిచేస్తుందా.?
-
Shreyas Iyer: ఆ ఇద్దరే మ్యాచ్ గెలిపించారు.. మాటలు రావడం లేదు.. తొలి విజయంపై శ్రేయస్ భావోద్వేగం!