విజయవాడ పోలీసులకు చిక్కిన చెడ్డీ గ్యాంగ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
కొన్నిరోజులుగా విజయవాడ పోలీసులను ముప్పుతిప్పలు పెడుతున్న చెడ్డీ గ్యాంగ్ ఎట్టకేలకు చిక్కింది. గుజరాత్లో నిఘా వేసిన విజయవాడ పోలీసులు చెడ్డీ గ్యాంగ్‌కు చెందిన ముగ్గురు సభ్యులను అరెస్ట్ చేసి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వారిలో గుజరాత్‌లోని దాహోద్ జిల్లా గుల్చర్ గ్రామానికి చెందిన మడియా కాంజీమేడా, సక్ర మండోడ్, మధ్యప్రదేశ్‌కు చెందిన కమలేష్ బాబేరియా అలియాస్ కమలేష్ అలియాస్ కమ్లా జుబువా ఉన్నారు. పరారీలో ఉన్న మిగిలిన ఏడుగురి కోసం గుజరాత్‌లోనే ఉన్న మరో పోలీసుల బృందం గాలిస్తోంది.
Read Also: సోషల్ మీడియాలో సచిన్ ఆసక్తికర పోస్ట్
Also Read
కాగా నిందితుల నుంచి రూ. 20 వేల నగదు, 32 గ్రాముల బంగారం, 2.5 కిలోల వెండిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గుజరాత్లో జరిగిన ఓ పెళ్లి విందులో గతనెల 22న కలుసుకున్న 10 మంది సభ్యుల బృందం దక్షిణాదిలో చోరీలు చేయాలని నిర్ణయించుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. దీంతో గుజరాత్ నుంచి రైలు ద్వారా చెన్నై చేరుకుని… అక్కడి నుంచి గత నెల 28న చెడ్డీ గ్యాంగ్ విజయవాడ చేరుకుంది. 10 మంది సభ్యులు ఐదుగురు చొప్పున రెండు ముఠాలుగా విడిపోయి దొంగతనాలకు పాల్పడి తిరిగి గుజరాత్ వెళ్లిపోయినట్టు విజయవాడ పోలీసు కమిషనర్ కాంతిరాణా టాటా తెలిపారు. ప్రస్తుతం అరెస్ట్ చేసిన నిందితులను విచారిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.
తాజావార్తలు
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Child S*exual Abuse Content: ఇన్‌స్టాగ్రామ్‌లో చైల్డ్ ఫో*ర్న్ కంటెంట్ షేరింగ్.. వ్యక్తిపై కేసు నమోదు.!
-
Railways: మొన్న హనీమూన్, నేడు బర్త్ డే.. వివాదాల పాలవుతున్న రైల్వే..
-
Lenin OTT: జీ5లో ‘లెనిన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లోనే 100 మిలియన్ స్ట్రీమింగ్ మినిట్స్!
-
Viswanath and Sons’ Censor : విశ్వనాథ్ అండ్ సన్స్’ సెన్సార్ టాక్.. సింపుల్ బ్లాక్‌బస్టర్
ట్రెండింగ్
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్‌గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్‌గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..
-
Beetroot Dosa: ఎప్పుడు మాములు దోసలేనా..? కొత్తగా క్రిస్పీ & హెల్దీ బీట్రూట్ దోస చేసేయండి ఇలా.!
-
890cc V-Twin ఇంజిన్, కొత్త చాసిస్, కొత్త లుక్ తో Ducati Monster V2 లాంచ్.. ధర ఎంతంటే..?