Vijayawada: దసరా నవరాత్రుల ఎఫెక్ట్.. రికార్డు స్థాయిలో అమ్మవారికి ఆదాయం
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Vijayawada: దసరా నవరాత్రి ఉత్సవాల సందర్భంగా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన దుర్గమ్మ అమ్మవారికి రికార్డు స్థాయిలో ఆదాయం సమకూరింది. ఆర్జిత సేవలు, దర్శన టిక్కెట్లు, లడ్డూ ప్రసాదం, భక్తులు తలనీలాల సమర్పణ ద్వారా రూ.6.34 కోట్ల ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. లడ్డూ ప్రసాదాల ద్వారా రూ.2.48 కోట్లు, దర్శనం టిక్కెట్ల ద్వారా రూ.2.5 కోట్లు, ఆర్జిత సేవా టిక్కెట్ల ద్వారా రూ.1.03 కోట్లు, తలనీలాల ద్వారా రూ.20 లక్షల ఆదాయం లభించింది. కాగా గత ఏడాది నవరాత్రి ఉత్సవాల సమయంలో రూ.4.08 కోట్లు మాత్రమే సమకూరింది. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది సుమారు రూ.2 కోట్లు అధికంగా ఆదాయం వచ్చింది. దసరా నవరాత్రి ఉత్సవాల్లో మొత్తం 12 లక్షల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.
Read Also: TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. ఆ రెండు రోజులు ఆలయం మూత..
Also Read
అటు దసరా ఉత్సవాలు ముగిసిన తరువాత కూడా పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుంటున్నారు. దీంతో హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. దసరా ఉత్సవాలు అక్టోబర్ 5వ తేదీన ముగిసినా 9వ తేదీ ఆదివారం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. లక్షల సంఖలో భక్తులు తరలిరావటంతో పాటుగా భవానీ భక్తులు కూడా పెద్ద ఎత్తున దుర్గమ్మ సన్నిధికి తరలివచ్చారు. దీంతో హుండీ ఆదాయం కూడా భారీగా పెరిగే అవకాశం కనిపిస్తోంది. గత ఏడాది దసరా నవరాత్రి ఉత్సవాల సమయంలో అమ్మవారికి హుండీ ఆదాయం ద్వారా రూ.7.5 కోట్ల ఆదాయం లభించింది.
తాజావార్తలు
-
Konda Surekha : కాంగ్రెస్ అధ్యక్షుడితో కొండా సురేఖ భేటీ.. కూతురి వ్యాఖ్యలపై ఖర్గే ఆరా
-
Telangana Auto Strike : ఆటో, క్యాబ్ సమ్మె క్యాన్సిల్.. ప్రభుత్వ చర్చలు సక్సెస్
-
AK-203: AK-203 ‘షేర్’.. రష్యన్ టెక్నాలజీ, మేడ్ ఇన్ ఇండియా రైఫిల్
-
NMMS Scholarship : విద్యార్థులకు రూ.48 వేల స్కాలర్షిప్.. రేపే లాస్ట్ ఛాన్స్.!
-
Varanasi: 50కి పైగా భాషల్లో ‘వారణాసి’.. డబ్బింగ్ కోసం 1600 మందికి పైగా ఆర్టిస్టులు!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!